నేను పాక్ క్రికెట్ జ‌ట్టుకు డైటీషియ‌న్‌ను కాను: సానియా

  హైద‌రాబాద్‌: ఆదివారం జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో పాక్‌ జట్టును భారత్ చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. అయితే, పాక్ ఓటమిని జీర్ణియించుకోని పాక్‌ నెటిజన్లు జట్టుతోపాటు కెప్టెన్ సర్ఫరాజ్ ను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక, టెన్నిస్ స్టార్ సానియాను కూడా ఉద్దేశిస్తూ కొందరు వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. తాజాగా పాకిస్థానీ నటి వీణా మాలిక్‌ సానియాపై ఓ ట్వీట్ చేసింది. గతంలో సానియా తన భర్త షోయబ్‌ మాలిక్‌, కుమారుడు ఇజాన్‌, ఇతర పాకిస్థానీ […] The post నేను పాక్ క్రికెట్ జ‌ట్టుకు డైటీషియ‌న్‌ను కాను: సానియా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైద‌రాబాద్‌: ఆదివారం జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో పాక్‌ జట్టును భారత్ చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. అయితే, పాక్ ఓటమిని జీర్ణియించుకోని పాక్‌ నెటిజన్లు జట్టుతోపాటు కెప్టెన్ సర్ఫరాజ్ ను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక, టెన్నిస్ స్టార్ సానియాను కూడా ఉద్దేశిస్తూ కొందరు వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. తాజాగా పాకిస్థానీ నటి వీణా మాలిక్‌ సానియాపై ఓ ట్వీట్ చేసింది. గతంలో సానియా తన భర్త షోయబ్‌ మాలిక్‌, కుమారుడు ఇజాన్‌, ఇతర పాకిస్థానీ క్రికెటర్లతో కలిసి ఓ హుక్కా బార్‌కు వెళ్లారు. ఆ సమయంలో సానియా హుక్కా తాగుతున్నప్పుడు తీసిన వీడియోను ఓ నెటిజన్‌ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. దీనిపై వీణా మాలిక్‌ సానియాను ట్యాగ్‌ చేస్తూ..‘సానియా.. మీ అబ్బాయి విషయంలో నేను చింతిస్తున్నాను. మీరంతా కలిసి ఆ చిన్నారిని హుక్కా బార్‌కు తీసుకెళతారా? అది ఎంత ప్రమాదకరమో తెలుసా? నాకు తెలిసినంత వరకు మీరు వెళ్లిన బార్‌లో ఎక్కువగా జంక్‌ ఫుడ్‌ అమ్ముతూ ఉంటారు. క్రీడాకారులైన మీరు, మీ భర్త ఇలాంటి ఆహారం తింటే ఆరోగ్యం పాడవుతుంది. ఓ తల్లిగా మీకు ఈ విషయాలన్నీ తెలిసుండాలి’ అని పేర్కొంది.

దీంతో వీణా మాలిక్ ట్వీట్‌కు సానియా మీర్జా కౌంట‌ర్ ఇచ్చింది. ‘వీణా.. నేను నా కుమారుడిని ఎలాంటి బార్‌కు తీసుకెళ్లలేదు. అయినా ఈ విషయాలన్నీ మీకు అనవసరం. నేను నా బిడ్డను ఎంత జాగ్రత్తగా చూసుకుంటానో నాకు మాత్రమే తెలుసు. మరో విషయం గుర్తుంచుకోండి.. పాకిస్థానీ క్రికెటర్లు ఏం తింటారు, ఎప్పుడు నిద్రపోతారు వంటి విషయాలను పట్టించుకోవడానికి నేనేమీ పాక్‌ క్రికెట్‌ టీం డైటీషియన్‌ను కాను. వారి తల్లిని కాను.. ప్రిన్సిపల్‌ని కాను. ఏదేమైనా మీరు మా పట్ల ఇంత శ్రద్ధ చూపుతున్నందుకు ధన్యవాదాలు’ అని సానియా చురకలు అంటించింది.

I’m not Pak team’s dietician says sania mirza

The post నేను పాక్ క్రికెట్ జ‌ట్టుకు డైటీషియ‌న్‌ను కాను: సానియా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: