లోక్ సభ స్పీకర్ గా ఓమ్ బిర్లా…ఖరారు చేసిన బిజెపి అగ్రనాయకత్వం !

  న్యూఢిల్లీ: 17వ లోక్ సభ సభాపతిగా రాజస్థాన్, కోటా నుంచి గెలుపొందిన ఎంపి ఓం బిర్లాను బిజెపి అగ్రనాయకత్వం ఖరారు చేసింది. రెండో రోజు లోక్ సభ సమావేశాలు ప్రారంభం కాగా, స్పీకర్ ఎన్నిక జరగనుంది. అందుకు లోక్ సభ స్వీకర్ స్థానానికి ఓం బిర్లా మంగళవారం ఓమ్ ప్రకాశ్, ఎన్ డిఎ తరఫున నామినేషన్ దాఖలు చేయనున్నారు. బిజెపిలో విద్యార్థి నేతగా చేరిన ఆయన బిజెవైఎంలో అనేక హోదాల్లో పని చేశారు. 2003లో కోటా […] The post లోక్ సభ స్పీకర్ గా ఓమ్ బిర్లా… ఖరారు చేసిన బిజెపి అగ్రనాయకత్వం ! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: 17వ లోక్ సభ సభాపతిగా రాజస్థాన్, కోటా నుంచి గెలుపొందిన ఎంపి ఓం బిర్లాను బిజెపి అగ్రనాయకత్వం ఖరారు చేసింది. రెండో రోజు లోక్ సభ సమావేశాలు ప్రారంభం కాగా, స్పీకర్ ఎన్నిక జరగనుంది. అందుకు లోక్ సభ స్వీకర్ స్థానానికి ఓం బిర్లా మంగళవారం ఓమ్ ప్రకాశ్, ఎన్ డిఎ తరఫున నామినేషన్ దాఖలు చేయనున్నారు. బిజెపిలో విద్యార్థి నేతగా చేరిన ఆయన బిజెవైఎంలో అనేక హోదాల్లో పని చేశారు. 2003లో కోటా సౌత్ అసెంబ్లీ కాంగ్రెస్ ఎంఎల్ఎ శాంతి లాల్ ధరివాల్‌పై గెలిచి, రాజకీయాల్లోకి ప్రవేశించారు. తాజా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కోటా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ కు చెందిన రామ్ నారాయణ్ మీనాపై 2.50 లక్షలపై ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం రాజస్తాన్ అసెంబ్లీకి మూడు సార్లు, కోటా నుంచి లోక్‌సభకు రెండుసార్లు గెల్పొందారు.

ఓం బిర్లా భార్య మట్లాడుతూ.. తన భర్త లోక్ సభ సభాపతిగా ఎన్నికవడం ఎంతో గర్వంగా ఉందని, తన భర్తను ఇంత గొప్ప పదవికి ఎంపిక చేసిన్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, క్యాబినెట్ కు అమిత్ బిర్లా కృతజ్ఞతలు తెలిపారు. కాగా, 16వ లోక్ సభలో స్పీకర్ గా వ్యవహరించిన సుమిత్రా మహాజన్, గత ఎన్నికల్లో పోటీ చేయలేదన్న సంగతి తెలిసిందే. సభలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో ఓమ్ బిర్లా ఎటువంటి అడ్డంకులూ కలిగే పరిస్థితి లేదు. బిజెపి అగ్ర నాయకత్వం స్పీకర్ పదవికి ఓం బిర్లాతో పాటు పశ్చిమ బెంగాల్ ఎంపి అహుల్‌వాలియా, ఎంపి రాధామోహన్ సింగ్‌ల పేర్లను కూడా పరిశీలించినట్టు సమాచారం.

BJP Om Birla Set To Be Next Lok Sabha Speaker

Related Images:

[See image gallery at manatelangana.news]

The post లోక్ సభ స్పీకర్ గా ఓమ్ బిర్లా… ఖరారు చేసిన బిజెపి అగ్రనాయకత్వం ! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.