పరాయి బిడ్డను రక్షించి.. కన్నబిడ్డ కాటికి

  అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతంలో ఓ బాలుడు ట్రాక్టర్ ఎక్కి తాళాన్ని తిప్పడంతో ట్రాక్టర్ ముందుకు దుసుకెళ్లింది. అక్కడే ఉన్న చిన్నారి పైనుంచి ట్రాక్టర్ వెళ్లడంతో ఘటనా స్థలంలోనే చిన్నారి మృత్యువాతపడ్డాడు. ముగ్గురు బాలుర్లు ట్రాక్టర్ సమీపంలో ఆడుకుంటున్నారు. ఇందులో నాలుగేళ్ల బాలుడు ట్రాక్టర్ ఎక్కి తాళం తిప్పడంతో ట్రాక్టర్ ముందుకు కదిలింది. దీంతో ట్రాక్టర్ ముందుకెళ్లుతుండగా సులోచన అనే మహిళ గమనించి ఆ బాలుడిని కిందకు దించింది. దీంతో ట్రాక్టర్ […] The post పరాయి బిడ్డను రక్షించి.. కన్నబిడ్డ కాటికి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతంలో ఓ బాలుడు ట్రాక్టర్ ఎక్కి తాళాన్ని తిప్పడంతో ట్రాక్టర్ ముందుకు దుసుకెళ్లింది. అక్కడే ఉన్న చిన్నారి పైనుంచి ట్రాక్టర్ వెళ్లడంతో ఘటనా స్థలంలోనే చిన్నారి మృత్యువాతపడ్డాడు. ముగ్గురు బాలుర్లు ట్రాక్టర్ సమీపంలో ఆడుకుంటున్నారు. ఇందులో నాలుగేళ్ల బాలుడు ట్రాక్టర్ ఎక్కి తాళం తిప్పడంతో ట్రాక్టర్ ముందుకు కదిలింది. దీంతో ట్రాక్టర్ ముందుకెళ్లుతుండగా సులోచన అనే మహిళ గమనించి ఆ బాలుడిని కిందకు దించింది. దీంతో ట్రాక్టర్ సమీపంలో ఉన్న సులోచన కుమారుడి పైనుంచి ట్రాక్టర్ పోయింది. దీంతో ఆమె గుండెలు విలసేలా కన్నీంటి పర్యంతమయ్యారు. దంపతుల మధ్య కలహాలు జరగడంతో సులోచన తన తండ్రి వద్ద ఉంటుంది. సులోచన క్యాటరింగ్ పనులు చేస్తూ ఉంది. కన్న బిడ్డను కోల్పోయి కూడా పరాయి బిడ్డను రక్షించిందని గ్రామస్థులు ప్రశంసిస్తున్నారు. దీంతో ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాక్టర్ యజమాని, డ్రైవర్ పై కేసు నమోదు చేశారు.

 

Child Dead in Tractor Accident in Guntur

The post పరాయి బిడ్డను రక్షించి.. కన్నబిడ్డ కాటికి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: