అనంత్‌నాగ్‌లో ఎదురుకాల్పుల్లో.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

  శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో మంగళవారం జరిగిన భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మద్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ జవాను ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్లితే… అనంత్‌నాగ్‌ జిల్లాలోని మహర్మ గ్రామంలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందిండంతో అక్కడ భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. భద్రతా సిబ్బందిని చూసిన ఉగ్రవాదులు తెల్లవారుజామున 4 గంటలకు గ్రనేడ్లతో దాడి చేశారు. ఈ ఎదురుకాల్పుల్లో ఓ జవాను ప్రాణాలు […] The post అనంత్‌నాగ్‌లో ఎదురుకాల్పుల్లో.. ఇద్దరు ఉగ్రవాదుల హతం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో మంగళవారం జరిగిన భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మద్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ జవాను ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్లితే… అనంత్‌నాగ్‌ జిల్లాలోని మహర్మ గ్రామంలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందిండంతో అక్కడ భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. భద్రతా సిబ్బందిని చూసిన ఉగ్రవాదులు తెల్లవారుజామున 4 గంటలకు గ్రనేడ్లతో దాడి చేశారు. ఈ ఎదురుకాల్పుల్లో ఓ జవాను ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడ్డిన వీరిద్దరూ ఆర్మీ జవాన్లు స్థానిక ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ప్రతిగా భద్రతా దళాల ఇద్దరు ఉగ్రవాదులను ఎదురు కాల్పుల్లో మట్టుబెట్టాయి. మరో ఉగ్రవాది అక్కడున్న భవనంలో తలదాచుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ ఉగ్రవాది కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక హతమైన ఉగ్రవాదులు జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందినవారిగా ఆర్మీ గుర్తించింది. కాగా, ఈ ప్రాంతంలో గడిచిన 24 గంటల్లోపే ఇది రెండో ఎన్ కౌంటర్. నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ మేజర్‌ కేతన్‌ శర్మ అమరుడు కాగా, ఈ రోజు ఇద్దరు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.

Two terrorists, Soldier Killed In Encounter In Anantnag

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అనంత్‌నాగ్‌లో ఎదురుకాల్పుల్లో.. ఇద్దరు ఉగ్రవాదుల హతం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: