రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య

  జోగులాంబ గద్వాల: రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లాలోని మానవపాడు మండలం పెద్దపొతులపాడు గ్రామ సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే… ప్రేమజంట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించాడంతో ఘటన స్థలికి చేరుకొని మృతదేహాలను పరిశీలించి మృతులు ఉండవెల్లి మండలం ఇటీకాలపాడు గ్రామానికి చెందిన లోకేశ్, కస్తూరిగా గుర్తించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ […] The post రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

జోగులాంబ గద్వాల: రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లాలోని మానవపాడు మండలం పెద్దపొతులపాడు గ్రామ సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే… ప్రేమజంట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించాడంతో ఘటన స్థలికి చేరుకొని మృతదేహాలను పరిశీలించి మృతులు ఉండవెల్లి మండలం ఇటీకాలపాడు గ్రామానికి చెందిన లోకేశ్, కస్తూరిగా గుర్తించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.