10న జిహెచ్‌ఎంసి జంతు రక్షణ కేంద్రం ప్రారంభం

మన తెలంగాణ/సిటీబ్యూరో : గ్రేటర్ హైదరాబాద్‌లో జంతువుల సంరక్షణ లో భాగంగా పతుల్లాగూడలో నిర్మిస్తున్న యానిమల్ కేర్ సెంటర్‌ను జులై 10 లోగా ప్రారంభించడానికి చర్యలు చేపట్టినట్టు జీహెఎంసీ కమిషనర్ దాన కిషోర్ వెల్లడించారు. ఫతుల్లాగూడలో నిర్మిస్తున్న ఎనిమల్ కేర్ సెంటర్‌ను నేడు జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భ ంగా కమిషనర్ మాట్లాడుతూ అత్యంత ఆధునిక ప్రమాణాలతో రూ. 7 కోట్ల వ్యయం చేసి నిర్మిస్తున్న ఎనిమల్ వెల్ఫేర్ సెంటర్ పనులన్నింటిని యుద్ద […] The post 10న జిహెచ్‌ఎంసి జంతు రక్షణ కేంద్రం ప్రారంభం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/సిటీబ్యూరో : గ్రేటర్ హైదరాబాద్‌లో జంతువుల సంరక్షణ లో భాగంగా పతుల్లాగూడలో నిర్మిస్తున్న యానిమల్ కేర్ సెంటర్‌ను జులై 10 లోగా ప్రారంభించడానికి చర్యలు చేపట్టినట్టు జీహెఎంసీ కమిషనర్ దాన కిషోర్ వెల్లడించారు. ఫతుల్లాగూడలో నిర్మిస్తున్న ఎనిమల్ కేర్ సెంటర్‌ను నేడు జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భ ంగా కమిషనర్ మాట్లాడుతూ అత్యంత ఆధునిక ప్రమాణాలతో రూ. 7 కోట్ల వ్యయం చేసి నిర్మిస్తున్న ఎనిమల్ వెల్ఫేర్ సెంటర్ పనులన్నింటిని యుద్ద ప్రాతిపదికన పూర్తిచేసి జులై 10లోగా ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. ఈ కేంద్రంలో 400 వీధి కుక్కలు 200 కోతులు, 50కి పైగా గేదెలకు షెల్టర్ ఇవ్వడానికి ఏర్పాట్లు ఉన్నాయని, ఇప్పటికే అంబర్‌పేట్‌లోని ఎనిమల్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని, దీనికి అదనంగా జీడిమెట్లలోనూ మరో ఎని మల్ వెల్ఫేర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామని ఆయన తెలిపారు. ఫతుల్ల గూడ, జవహర్‌నగర్, గాజులరామారంలలో ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన ఎనిమల్ క్రిమిటోరియంలను ఏర్పాటు చేయనున్నామని, వీటి ఏర్పా టుకు టెండర్లను పిలవడం జరిగిందని పేర్కొన్నారు. ఫతుల్లగూడ ఎనిమల్ కేర్ సెంటర్ ప్రారంభంతో ఆటోనగర్ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభించనున్నదని దానికిషోర్ వెల్లడించారు. ఆటో నగర్‌తో పాటు మౌలాలి సమీపంలోని బార్క్ అందించే సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఐదు టన్నుల సామర్థ్యమున్న బయో మెథనైజేషన్ ప్లాంట్ (బయోగ్యాస్) ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
రీసైక్లింగ్ ప్లాంట్ సిద్ధ్దం
రోజుకు 500 మెట్రిక్ టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసేందుకు జీడిమెట్లలో ఏర్పాటుచేసిన ప్లాంట్‌ను 15 రోజుల్లోగా ప్రారంభించనున్నట్టు జీహెఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ తెలిపారు. ఫతుల్లగుూడలో ప్రతిపాదిత సి అండ్ డి ప్లాంట్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీడిమెట్లలో ఏర్పాటుచేసిన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ నిర్మాణ పనులు 90శాతంకు పైగా పూర్తి అయ్యాయని, మరో రెండు వారాల్లో దీనిని ప్రారంభించేందుకు చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఫతుల్లగూడలో భవన నిర్మాణ వ్యర్థాల ప్లాంట్ ఏర్పాటుకు టెండర్ ప్రక్రియ పూరె్తై అగ్రిమెంట్ స్థాయిలో ఉందని పేర్కొన్నారు. ఈ అగ్రిమెంట్‌ను వెంటనే పూర్తిచేసి మరో ఆరు నెలలోగా ఈ ప్లాంట్‌ను కూడా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ రెండింటితో పాటు శంషాబాద్, శేరిలింగుంపల్లిలలోనూ నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు తగు స్థలాన్ని కేటాయించాల్సిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కోరామని కమిషనర్ పేర్కొన్నారు.

Animal Care Center in HyderabadRelated Images:

[See image gallery at manatelangana.news]

The post 10న జిహెచ్‌ఎంసి జంతు రక్షణ కేంద్రం ప్రారంభం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: