విజయ డెయిరీ ఆధ్వర్యంలో 200 మొబైల్ పార్లర్లు

హైదరాబాద్‌లో 100, జిల్లాల్లో 100 పార్లర్ల ఏర్పాటు జూన్ చివర లేదా జులై మొదటి వారంలో ప్రారంభం 400 మంది నిరుద్యోగులకు ఉపాధి మన తెలంగాణ/హైదరాబాద్: వ్యాపారాన్ని విస్తరించడంతో పాటు ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులను చేరువ చేసేందుకు విజయ డెయిరీ మొబైల్ పార్లర్‌లను ప్రారంభించేందుకు సిద్దమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 200 మొబైల్ పార్లర్‌లను ఏర్పాట్లు చేయాలని విజయ డెయిరీ పాలకమండలి నిర్ణయించింది. అందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలో 100, జిల్లాల్లో మరో 100 ఏర్పాటు […] The post విజయ డెయిరీ ఆధ్వర్యంలో 200 మొబైల్ పార్లర్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్‌లో 100, జిల్లాల్లో 100 పార్లర్ల ఏర్పాటు
జూన్ చివర లేదా జులై మొదటి వారంలో ప్రారంభం
400 మంది నిరుద్యోగులకు ఉపాధి
మన తెలంగాణ/హైదరాబాద్: వ్యాపారాన్ని విస్తరించడంతో పాటు ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులను చేరువ చేసేందుకు విజయ డెయిరీ మొబైల్ పార్లర్‌లను ప్రారంభించేందుకు సిద్దమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 200 మొబైల్ పార్లర్‌లను ఏర్పాట్లు చేయాలని విజయ డెయిరీ పాలకమండలి నిర్ణయించింది. అందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలో 100, జిల్లాల్లో మరో 100 ఏర్పాటు చేయనుంది.ఈ మొబైల్ పార్లర్‌లను జూన్ చివరి వారం లేదా జులై మొదటి వారంలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు విజయ డెయిరీ కార్పొరేషన్ చైర్మన్ లోక భూమారెడ్డి తెలిపారు. విజయ డెయిరీ కార్యాలయంలో సోమవారం మోడల్ మొబైల్ పార్లర్ వాహనాలను ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు, ఇతర అధికారులతో కలిసి భూమారెడ్డి పరిశీలించారు. ఒక్కొక్క మొబైల్ పార్లర్ వాహనం ఖరీదు రూ.1.80 లక్షలని… ఈ 200 వాహనాలను విజయ డెయిరీ నిధులతో కొనుగోలు చేసి లబ్ధిదారులకు అందజేయనున్నట్లు చెప్పారు. వాహనాన్ని అప్పగించిన తర్వాత లబ్ధిదారుడు …. సబ్సిడీ మినహాయించుకొని వ్యాపారం ద్వారా వచ్చిన ఆదాయం నుంచి నెలకు కొంచెం చొప్పున వాహనం విలువలో 60 శాతం చెల్లించాల్సి ఉంటుందని భూమారెడ్డి వెల్లడించారు. ప్రతి వాహనానికి డ్రైవర్‌తో పాటు, సెల్ప్‌మెన్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. విజయ డెయిరీ చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ఇంటింటికీ విజయ డెయిరీ ఉత్పత్తులను సరఫరా చేసే అవకాశాలు పెరుగుతాయన్నారు. వ్యాపారం విస్తరించడంతో పాటు …దాదాపు 400 మంది నిరుద్యోగులకు ఉపాధి లభించనుందని ఛైర్మన్ భూమారెడ్డి తెలిపారు.
పది రోజుల్లో లబ్ధిదారుల ఎంపిక …..
మొబైల్ పార్లర్‌ల లబ్ధిదారుల ఎంపికను 10 రోజుల్లో పూర్తిచేయనున్నట్లు ఛైర్మన్ లోక భూమారెడ్డి తెలిపారు. ఇప్పటికే డెయిరీ ఉత్పత్తులను విక్రయిస్తున్న వెండర్స్‌తో పాటు, నిరుద్యోగులను నుంచి రెండు నెలలుగా దరఖాస్తులు స్వీకరించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేసి, వాహనాలను అందజేయనున్నట్లు వివరించారు. విజయ డెయిరీ చేపట్టిన సంస్కరణలతో గత 10 నెలల్లో రోజుకు 1.50 లక్షల లీటర్ల పాల విక్రయాలు పెరిగాయని , ఈ మొబైల్ పార్లర్‌ల ఏర్పాటు తర్వాత హైదరాబాద్ నగరంతో పాటు, జిల్లాల్లో విజయ డెయిరీ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుందని భూమారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

vijaya dairy plans to 200 mobile parlors in State

Related Images:

[See image gallery at manatelangana.news]

The post విజయ డెయిరీ ఆధ్వర్యంలో 200 మొబైల్ పార్లర్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: