పెట్రోల్ బాటిళ్ళతో కాంట్రాక్ట్ టీచర్ల నిరసన

మన తెలంగాణ/ఖమ్మం: భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయులంతా సోమవారం ఆందోళనకు దిగారు. గత పదేళ్ళ నుంచి పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను కాదని మళ్లీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వడంపై నిరసన తెలిపారు. భద్రాచలం ఐటిడిఏ పరిధిలో ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలలో గత పదేళ్ళ నుంచి కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు పనిచేస్తున్నా రు. అయితే ఈ ఏడాది కొత్త విద్యాసంవత్సరాని కి వారి సేవలను రెన్యువల్ చేయకుం డా మ ళ్లీ కొత్తగా నోటిఫికేషన్ […] The post పెట్రోల్ బాటిళ్ళతో కాంట్రాక్ట్ టీచర్ల నిరసన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/ఖమ్మం: భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయులంతా సోమవారం ఆందోళనకు దిగారు. గత పదేళ్ళ నుంచి పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను కాదని మళ్లీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వడంపై నిరసన తెలిపారు. భద్రాచలం ఐటిడిఏ పరిధిలో ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలలో గత పదేళ్ళ నుంచి కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు పనిచేస్తున్నా రు. అయితే ఈ ఏడాది కొత్త విద్యాసంవత్సరాని కి వారి సేవలను రెన్యువల్ చేయకుం డా మ ళ్లీ కొత్తగా నోటిఫికేషన్ జారీ చేశారు. దీని వల్ల తమ సీనియార్టీని కొల్పోతామని వారంతా ఆందోళన చేశారు.పెట్రోల్ సీసాలను చేతబట్టుకోని ఐటిడిఏ భవనంకు ఎక్కి ఆత్మహ త్య చేసుకుంటామని అల్టిమేటమ్ జారీ చేశారు. కొత్తగా నోటీఫికేషన్ జారీ చేయడం వల్ల తామంతా రోడ్డుపై పడుతున్నామని వారం తా ఆవేదన వ్యక్తంచేశారు. ఆతరువాత పోలీసులు జోక్యంచేసుకొని వారిని కిందికి దింపేశారు.తమ ను ఈ ఏడాది కూడా య ధావిధిగా కొనసాగించి కొత్తగాజారీ చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేయాలని, తమ పోస్టులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.

Contract teachers protest with petrol bottlesRelated Images:

[See image gallery at manatelangana.news]

The post పెట్రోల్ బాటిళ్ళతో కాంట్రాక్ట్ టీచర్ల నిరసన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: