పక్కనోడి జీవితానికి ఏ హానీ జరుగకూడదు

  ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జి మూవీమేకర్స్ నిర్మిస్తున్న చిత్రం ‘గుణ 369’. అర్జున్ జంధ్యాల దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మిస్తున్నారు. “మనం చేసే తప్పుల వల్ల మన జీవితానికి ఏం జరిగినా ఫర్వాలేదు. కానీ పక్కనోడి జీవితానికి ఏ హానీ జరుగకూడదు”అని సాయికుమార్ గంభీరమైన స్వరంతో చెప్పే మాటలతో ‘గుణ 369’ టీజర్ సోమవారం విడుదలైంది. విడుదలైన కొద్ది క్షణాల్లోనే […] The post పక్కనోడి జీవితానికి ఏ హానీ జరుగకూడదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జి మూవీమేకర్స్ నిర్మిస్తున్న చిత్రం ‘గుణ 369’. అర్జున్ జంధ్యాల దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మిస్తున్నారు. “మనం చేసే తప్పుల వల్ల మన జీవితానికి ఏం జరిగినా ఫర్వాలేదు. కానీ పక్కనోడి జీవితానికి ఏ హానీ జరుగకూడదు”అని సాయికుమార్ గంభీరమైన స్వరంతో చెప్పే మాటలతో ‘గుణ 369’ టీజర్ సోమవారం విడుదలైంది. విడుదలైన కొద్ది క్షణాల్లోనే టీజర్ నెట్టింట్లో ట్రెండ్ అయింది. ఈ సందర్భంగా దర్శకుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ “టీజర్ చాలా బావుందంటూ అందరూ ప్రశంసిస్తున్నారు. టీజర్ ఎంత బావుందో సినిమా అంతకు వెయ్యి రెట్లు బావుంటుందని నమ్మకంగా చెప్పగలను”అని అన్నారు.

నిర్మాతలు అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ “యువతకు కావాల్సిన అంశాలు, ఫ్యామిలీ కోరుకునే విషయాలు, మాస్ ప్రేక్షకులకు నచ్చే సన్నివేశాల సమాహారంగా టీజర్ ఉందని ప్రశంసలు వస్తున్నాయి. ఈ నెలాఖరున పాటలను విడుదల చేస్తాం. మూడు రోజుల మినహా షూటింగ్ పూర్తయింది. ఆ సన్నివేశాలను కూడా త్వరలోనే తెరకెక్కిస్తాం”అని అన్నారు. 96లో శర్వానంద్ పై స్కై డైవింగ్ సీన్స్ ని తెరకెక్కించాల్సి ఉండగా.. ఇటీవలే థాయ్ ల్యాండ్ వెళ్లి ఆ క్రీడలో శిక్షణ తీసుకున్నాడు. ఆ సమయంలో అతడు పై నుంచి కింద పడడంతో భుజానికి కాస్తంత పెద్ద దెబ్బే తగిలిందని నిన్నటి రోజున వార్తలొచ్చాయి. వెంటనే విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చి సన్ షైన్ ఆస్పత్రిలో చేరారు శర్వానంద్. అతడి భుజానికి సంబంధించిన ఎముకలు కదిలాయని దానిని సరిదిద్దేందుకు చిన్నపాటి శస్త్ర చికిత్స అవసరం పడుతుందని డాక్టర్లు చెప్పారు.

Kartikeyas Guna 369 teaser released

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పక్కనోడి జీవితానికి ఏ హానీ జరుగకూడదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: