ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కల్కి’. శివాని, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘అ!’ వంటి ప్రయోగాత్మక, కొత్త తరహా చిత్రం తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, కమర్షియల్ ట్రైలర్, ‘హార్న్ ఓకే ప్లీజ్’ పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న […] The post ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కల్కి’. శివాని, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘అ!’ వంటి ప్రయోగాత్మక, కొత్త తరహా చిత్రం తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, కమర్షియల్ ట్రైలర్, ‘హార్న్ ఓకే ప్లీజ్’ పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా రిలీజ్ రైట్స్‌ను శ్రీ సత్యసాయి ఆర్ట్ అధినేత కె.కె. రాధామోహన్ సొంతం చేసుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ “కల్కి రిలీజ్ రైట్స్ శ్రీసత్యసాయి ఆర్ట్ బ్యానర్‌పై నేను తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. ‘కల్కి’ మోషన్ పోస్టర్, టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. సినిమా కంటెంట్, క్రేజ్ చూసి సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడానికి మేం సిద్ధమయ్యాం. త్వరలో నిర్వహించనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెయిన్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నాం. ఈనెల 28న ఈ సినిమా విడుదలవుతుంది. ఈ చిత్రంలో రాజశేఖర్ అద్భుతంగా నటించారు. అదా శర్మ, నందితా శ్వేత తమ తమ పాత్రల్లో చక్కగా నటించారు. ఇది ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. సినిమా చాలా బావుంటుంది. ఇందులో స్కార్లెట్ విల్సన్ ‘హార్న్ ఓకే ప్లీజ్’ పాట చేశారు”అని అన్నారు.

Rajasekhar Kalki Release on june 28

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: