ఎన్నికలు లేకుండా నిర్మాతల మండలిని ఎంపిక చేయాలి

  నిర్మాతల మండలికి ఎన్నికలు అవసరం లేదని చాలా మంది నిర్మాతల అభిప్రాయమని అంటున్నారు ప్రతాని రామకృష్ణ గౌడ్. తెలుగు ఫిలిం ఛాంబర్ నిర్మాతల మండలి ఎన్నికలు ఈ నెల 30న జరగనున్న నేపథ్యంలో తెలంగాణ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ సోమవారం హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “తెలుగు సినిమా నిర్మాతల మండలికి ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. ఈ విషయంలో ఇటీవలే […] The post ఎన్నికలు లేకుండా నిర్మాతల మండలిని ఎంపిక చేయాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నిర్మాతల మండలికి ఎన్నికలు అవసరం లేదని చాలా మంది నిర్మాతల అభిప్రాయమని అంటున్నారు ప్రతాని రామకృష్ణ గౌడ్. తెలుగు ఫిలిం ఛాంబర్ నిర్మాతల మండలి ఎన్నికలు ఈ నెల 30న జరగనున్న నేపథ్యంలో తెలంగాణ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ సోమవారం హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “తెలుగు సినిమా నిర్మాతల మండలికి ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. ఈ విషయంలో ఇటీవలే నిర్మాతల మండలి సమావేశం జరిపి రెండు ప్యానల్స్‌ను ఎంపికచేసింది. ఆ తరువాత కొన్ని నాటకీయ పరిణామాల మధ్య రెండు ప్యానల్స్ ఒక్కటయ్యాయి. అందులో కొందరిని పక్కన పెట్టారు. నిర్మాతల మండలి చాలా బాగా పనిచేస్తున్న క్రమంలో కొందరు కావాలని సమస్యలను సృష్టిస్తున్నారు.

ఇప్పటికే కొందరు ఎల్‌ఎల్ పి అంటూ ఛానల్స్ విషయంలో సపరేట్‌గా ఉండడంతో కౌన్సిల్ కు వచ్చే ఆదాయం తగ్గింది. ఆ సమస్యను పరిష్కరిస్తానని నిర్మాత సి కల్యాణ్ చెప్పారు. ఇక అనవసరంగా ఎన్నికల కోసం డబ్బు ఖర్చు చేసే బదులు అందరు కలిసి ఒక్కటిగా ప్యానల్‌ను ఎన్నుకుంటే బాగుంటుంది. ఈ విషయంలో ఎఫ్‌డిసి చైర్మన్ రామ్మోహనరావు, సురేష్ బాబుతో కూడా మాట్లాడాను. దాంతో పాటు చాలా మంది నిర్మాతల అభిప్రాయం కూడా అదే. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు విత్ డ్రా చేసుకుంటే బాగుంటుంది. ఎన్నికల తరువాత చేసే పని ముందే చేస్తే ఎన్నికలు లేకుండానే నిర్మాతల ప్యానల్‌ను ఎంచుకోవచ్చు. ఇప్పటి వరకు నిర్మాతల మండలి ఆధ్వర్యంలో హెల్త్ కార్డ్, పేద విద్యార్థుల చదువులకు సహాయం చేయడం లాంటివి చేస్తున్నాం.

అనవసర ఖర్చులు తగ్గించుకుంటే ఇలాంటి సేవ కార్యక్రమాలు మరిన్ని చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ అందరి ఉద్దేశ్యం ఒక్కటే .. ఎన్నికలు వద్దని. అందరు పెద్ద వాళ్లతో కూర్చొని నిర్మాతల మండలి ప్యానల్‌ను ఎంపిక చేస్తే బాగుంటుంది”అని అన్నారు. మరో నిర్మాత శంకర్ గౌడ్ మాట్లాడుతూ “అందరం కలిసిపోయి నిర్మాతల మండలి ఎన్నికల విషయంలో ఓ మాట మీదుంటే బాగుంటుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడినప్పుడు నిర్మాతల మండలిలో ఇద్దరు, ముగ్గురు తెలంగాణ నిర్మాతలకు కూడా పదవులు ఇవ్వాలి”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు సాయివెంకట్, జెవిఆర్‌తో పాటు పలువురు నిర్మాతలు పాల్గొన్నారు.

Film Chamber Producers Council Election on June 30

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఎన్నికలు లేకుండా నిర్మాతల మండలిని ఎంపిక చేయాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: