క్రేజీ కాంబినేషన్‌లో చిత్రం?

  అభిరుచి కలిగిన చిత్రాలను రూపొందించే దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ మధ్య సినిమాకు ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నారు. 2017లో బ్లాక్ బస్టర్ చిత్రం ‘ఫిదా’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కమ్ముల ప్రస్తుతం ఒక సినిమా గురించి పని చేస్తున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాకు గ్యాప్ వచ్చిందట. ఈ సినిమాలో డ్యాన్స్‌కు ప్రాధాన్యత ఉందని… అందుకే ఈ గ్యాప్‌లో హీరో హీరోయిన్లు డ్యాన్స్ నేర్చుకుంటున్నారని సమాచారం. అయితే ఈ గ్యాప్‌లో అక్కినేని […] The post క్రేజీ కాంబినేషన్‌లో చిత్రం? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అభిరుచి కలిగిన చిత్రాలను రూపొందించే దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ మధ్య సినిమాకు ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నారు. 2017లో బ్లాక్ బస్టర్ చిత్రం ‘ఫిదా’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కమ్ముల ప్రస్తుతం ఒక సినిమా గురించి పని చేస్తున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాకు గ్యాప్ వచ్చిందట. ఈ సినిమాలో డ్యాన్స్‌కు ప్రాధాన్యత ఉందని… అందుకే ఈ గ్యాప్‌లో హీరో హీరోయిన్లు డ్యాన్స్ నేర్చుకుంటున్నారని సమాచారం. అయితే ఈ గ్యాప్‌లో అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవిల క్రేజీ కాంబోను శేఖర్ కమ్ముల సెట్ చేశారని సమాచారం. ‘మజిలీ’ సూపర్ సక్సెస్‌తో చైతూ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నారు. చేతిలో కూడా మూడు, నాలుగు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.

మేనమామ వెంకటేష్‌తో కలిసి నటిస్తున్న ‘వెంకీమామ’ చిత్రం ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. దీంతో పాటు ‘బంగార్రాజు’, మేర్లపాక గాంధీ చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. ఇవేగాకుండా దిల్‌రాజు బ్యానర్‌లో మరో సినిమాకూడా లైన్‌లో ఉంది. మరి ఇన్ని సినిమాల మధ్యలో శేఖర్ కమ్ముల సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో వేచి చూడాలి. ఏదేమైనా చైతూ,- సాయి పల్లవిల కాంబినేషన్ కొత్తగా ఉంటుంది. ‘ఫిదా’ తో అందరినీ మెప్పించిన సాయిపల్లవి మళ్లీ శేఖర్ కమ్ములతో కలిసి పనిచేయడం కూడా ఈ ప్రాజెక్టును క్రేజీగా మారుస్తుంది.

Sekhar Kammula next film with Naga chaitanya, sai pallavi

Related Images:

[See image gallery at manatelangana.news]

The post క్రేజీ కాంబినేషన్‌లో చిత్రం? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: