సోఫా మూడు రకాలుగా..!

  లివింగ్‌రూంలో టీవీకి ఎదురుగా సోఫానూ దానికి అటూ ఇటూ ఎదురూబదురుగా కుర్చీలనూ వేస్తాం. సోఫాలో కూర్చుంటేనే టీవీ చూడ్డానికి సౌకర్యంగా ఉంటుంది. కానీ ఇంట్లోని చిన్నా పెద్దా అందరూ ఒకేసారి కలసి సోఫాలో కూర్చోవడానికి చోటు తక్కువ ఉంటుంది. ఇక, పిల్లలూ వారి స్నేహితులైతే ఒకేచోట దగ్గరగా కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికీ ఆడుకోవడానికీ ఇష్టపడతారు. అలా జరగాలంటే ఈ ‘మరకానా’ సోఫా ఉంటే మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఇటలీకి చెందిన డిజైనర్ ఇమాన్యుయేల్ మాగిని రూపొందించిన […] The post సోఫా మూడు రకాలుగా..! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

లివింగ్‌రూంలో టీవీకి ఎదురుగా సోఫానూ దానికి అటూ ఇటూ ఎదురూబదురుగా కుర్చీలనూ వేస్తాం. సోఫాలో కూర్చుంటేనే టీవీ చూడ్డానికి సౌకర్యంగా ఉంటుంది. కానీ ఇంట్లోని చిన్నా పెద్దా అందరూ ఒకేసారి కలసి సోఫాలో కూర్చోవడానికి చోటు తక్కువ ఉంటుంది. ఇక, పిల్లలూ వారి స్నేహితులైతే ఒకేచోట దగ్గరగా కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికీ ఆడుకోవడానికీ ఇష్టపడతారు. అలా జరగాలంటే ఈ ‘మరకానా’ సోఫా ఉంటే మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఇటలీకి చెందిన డిజైనర్ ఇమాన్యుయేల్ మాగిని రూపొందించిన ఈ సోఫా మూడు వరసల్లో మెట్లలా ఉంటుంది. కాబట్టి అందరూ ఒకేచోట నచ్చినట్లూ కూర్చోవచ్చు. ఇక, అవసరమైనపుడు దీనిలోని మధ్య మెట్టుని లోపలికి నెట్టేసి దీన్ని మామూలు సోఫాలా మార్చేయొచ్చు. అంతేకాదు, మధ్య మెట్టు కుషన్‌ని కిందికి తోసి ఈ సోఫాను దివాన్ కాట్‌లా చేస్తే పడుకునేందుకూ వీలుగా ఉంటుంది. త్రీ యిన్ వన్ అన్నమాట.

 

Sofa Using Three Ways in House

 

Sofa Using Three Ways in House

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సోఫా మూడు రకాలుగా..! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.