తొలి రాత్రిని అడ్డుకున్నందుకు…

చెన్నయ్ : తన తొలి రాత్రిని అడ్డకున్న తండ్రిని ఓ కొడుకు కర్రతో తలపై మోది చంపేశాడు. ఈ ఘటన తమిళనాడులోని అరియలూరు జిల్లా జయంకొండం పరిధిలోని ఆదిచ్చనల్లూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఈ గ్రామానికి చెందిన షణ్ముగం(48) కొడుకు ఇళమది(23)కి రెండు రోజుల క్రితం పెళ్లి జరిగింది. పెళ్లి అనంతరం ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇలమది తొలిరాత్రికి ముహూర్తం పెట్టారు. అయితే పెళ్లి ఖర్చు , పెళ్లికి వచ్చిన చెల్లింపు వివరాలను చెప్పాలని […] The post తొలి రాత్రిని అడ్డుకున్నందుకు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

చెన్నయ్ : తన తొలి రాత్రిని అడ్డకున్న తండ్రిని ఓ కొడుకు కర్రతో తలపై మోది చంపేశాడు. ఈ ఘటన తమిళనాడులోని అరియలూరు జిల్లా జయంకొండం పరిధిలోని ఆదిచ్చనల్లూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఈ గ్రామానికి చెందిన షణ్ముగం(48) కొడుకు ఇళమది(23)కి రెండు రోజుల క్రితం పెళ్లి జరిగింది. పెళ్లి అనంతరం ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇలమది తొలిరాత్రికి ముహూర్తం పెట్టారు. అయితే పెళ్లి ఖర్చు , పెళ్లికి వచ్చిన చెల్లింపు వివరాలను చెప్పాలని తండ్రి షణ్ముగం కొడుకు ఇలమదిని అడిగాడు. ఈ వ్యవహారంపై సోమవారం ఉదయం మాట్లాడుకుందామని ఇళమది తండ్రి షణ్ముగంకు చెప్పాడు. అయితే షణ్ముగం ఇళమది మాట వినకపోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన ఇళమది తండ్రి షణ్ముగం తలపై కర్రతో మోదాడు. ఈ క్రమంలో షణ్ముగం చనిపోయాడు. నిందితుడు ఇళమదిని పోలీసులు అరెస్టు చేశారు. శవపరీక్ష నిమిత్తం షణ్ముగం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ  ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Man Murder in Tamil Nadu

Related Images:

[See image gallery at manatelangana.news]

The post తొలి రాత్రిని అడ్డుకున్నందుకు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.