సంచార పశు వైద్యానికి మంచి స్పందన

మన తెలంగాణ/హైదరాబాద్: పశువుల దగ్గరకే వైద్యం అందాలని ప్రారంభించిన సంచార పశు వైద్యశాలలకు భారీ స్పందన లభిస్తోంది. ఇందుకోసం ఏర్పాటు చేసిన 1962 నంబరుకు విపరీతమైన కాల్స్ వస్తున్నాయి. ఈ నంబరుకు ఫోన్ చేస్తే ప్రత్యేక వాహనం వెళ్లి పశువులకు వైద్యసేవలందిస్తోంది. అయితే పలుమార్లు ఈ నెంబర్ నుంచి స్పందన రాకపోవడం, కొన్నిసార్లు స్పందించినా వాహనం రాకపోవడం వంటివి జరుగుతున్నట్లు రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. ఒకవేళ వచ్చినా పశువైద్యుడు ఉండటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు కేవలం […] The post సంచార పశు వైద్యానికి మంచి స్పందన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/హైదరాబాద్: పశువుల దగ్గరకే వైద్యం అందాలని ప్రారంభించిన సంచార పశు వైద్యశాలలకు భారీ స్పందన లభిస్తోంది. ఇందుకోసం ఏర్పాటు చేసిన 1962 నంబరుకు విపరీతమైన కాల్స్ వస్తున్నాయి. ఈ నంబరుకు ఫోన్ చేస్తే ప్రత్యేక వాహనం వెళ్లి పశువులకు వైద్యసేవలందిస్తోంది. అయితే పలుమార్లు ఈ నెంబర్ నుంచి స్పందన రాకపోవడం, కొన్నిసార్లు స్పందించినా వాహనం రాకపోవడం వంటివి జరుగుతున్నట్లు రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. ఒకవేళ వచ్చినా పశువైద్యుడు ఉండటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు కేవలం అన్ని కేసులకు ఈ సంచార వైద్య వాహనాలు అటెండ్ అవుతుండటంతో పలు సందర్భాల్లో అత్యవసర కేసులకు వెళ్లకుండా అంతరాయం ఏర్పడుతున్నట్లు తెలిసింది. దీనిపై అధ్యయనం చేసి, కొన్ని మార్పులు చేయాలని వైద్యులు సూచించారు. ఈ వాహనాలు అందుబాటులో లేనిపక్షంలో స్థానిక పశువైద్యుడిని పంపించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఒక్కో అంబులెన్స్ రోజుకు 7-12 పశువులకు వైద్యసేవలు అందిస్తోందన్నారు. తెలంగాణను ఆదర్శంగా తీసుకొని తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలు ఈ సేవలను మొదలుపెట్టాయన్నారు.

కేంద్ర ప్రభుత్వ దృష్టిని ఆకర్షించిన ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే విషయంపై ఇటీవల కేంద్ర పశుసంవర్ధక శాఖ అధికారులు ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించి వెళ్లారు. 2017 సెప్టెంబరులో ఈ సేవలను ప్రారంభించిన నాటి నుంచి ఫోన్‌కాల్స్ సంఖ్య పెరుగుతూ వస్తోంది. గతేడాది రోజుకు సగటున 2,500-3000 వరకు ఫోన్‌కాల్స్ వచ్చినట్లు పశుసంవర్ధకశాఖ వార్షిక నివేదికలో పేర్కొంది. జివికెఈఎంఆర్‌ఐ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా 99 (అంబులెన్స్) సంచార పశువైద్యశాలలను నిర్వహిస్తోంది. ఇద్దరు పశువైద్యులు, ఇద్దరు టెక్నీషియన్లు సహా పశువులకు అవసరమైన అన్నిరకాల మందులు, వైద్యపరికరాలను అందుబాటులో ఉంచుతున్నారు. నియోజకవర్గానికొకటి చొప్పున సంచార పశువైద్యశాలలు నిరంతరం సంచరిస్తుంటాయి. రైతులు ఫోన్ చేసిన అరగంట నుంచి గంటలోపే సేవలందించేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు ఈ సంచార పశువైద్యశాల ద్వారా సేవలు పొందినవారిలో దాదాపు 90శాతానికిపైగా వైద్యసేవలు బాగున్నాయని అభిప్రాయపడ్డారు. వార్షిక నివేదిక ప్రకారం గతేడాది 23,43,818 ఫోన్‌కాల్స్ వచ్చాయి.

Good response to nomadic veterinary medicine

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సంచార పశు వైద్యానికి మంచి స్పందన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: