ప్రైవేట్ ప్రైమరీ స్కూళ్లకూ ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రైవేట్ పాఠశాలల్లోనూ పూర్తి స్థాయిలో ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు ఉపయోగించే అంశంపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రైవేట్ పాఠశాలలకు సరిపడా పుస్తకాలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ప్రధానంగా ప్రైవేట్ స్కూళ్లలో 1- నుంచి 5 తరగతులకు ప్రైవేట్ ప్రచురణకర్తలు ముద్రించిన పుస్తకాలనే యాజమాన్యాలు ఉపయోగిస్తున్నాయి. ఈ పుస్తకాలకు ప్రీ-ప్రైమరీ, ఒకటవ తరగతి పుస్తకాలకు కూడా రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు తల్లిదండ్రులు వెచ్చించవలసి […] The post ప్రైవేట్ ప్రైమరీ స్కూళ్లకూ ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రైవేట్ పాఠశాలల్లోనూ పూర్తి స్థాయిలో ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు ఉపయోగించే అంశంపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రైవేట్ పాఠశాలలకు సరిపడా పుస్తకాలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ప్రధానంగా ప్రైవేట్ స్కూళ్లలో 1- నుంచి 5 తరగతులకు ప్రైవేట్ ప్రచురణకర్తలు ముద్రించిన పుస్తకాలనే యాజమాన్యాలు ఉపయోగిస్తున్నాయి. ఈ పుస్తకాలకు ప్రీ-ప్రైమరీ, ఒకటవ తరగతి పుస్తకాలకు కూడా రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు తల్లిదండ్రులు వెచ్చించవలసి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముద్రించిన పాఠ్యపుస్తకాలనే ఉపయోగించాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించినా, సకాలంలో సరిపడా పుస్తకాలు పంపిణీ జరగకపోవడంతో గత విద్యాసంవత్సరం ప్రైవేట్ యాజమాన్యాలకు మినహాయింపు లభించింది. అయితే వచ్చే విద్యాసంవత్సరం నుంచి మాత్రం కచ్చితంగా ప్రైవేట్ స్కూళ్లలో ప్రభుత్వ పాఠ్యపుస్తకాలే ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ నిర్ణయించినట్లు సమాచారం. ప్రభుత్వం ముద్రించిన పుస్తకాలను ఉపయోగించడం వల్ల తల్లిదండ్రులు పాఠ్యపుస్తకాలపై వెచ్చించే ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది. ప్రభుత్వ పాఠ్యపుస్తకాలలో విద్యార్థులకు శాస్త్రీయమైన విద్య అందే అవకాశం ఉంటుంది. వచ్చే విద్యాసంవత్సరం ప్రైవేట్ ప్రాథమిక పాఠశాలల్లో పూర్తి స్థాయిలో ప్రభుత్వ పుస్తకాలు ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
హామీ ఇచ్చిన ప్రైవేట్ యాజమాన్యాలు
విద్యా శాఖ నిర్దేశిత సిలబస్ ఉన్న సేల్ పుస్తకాలు మార్కెట్‌లో అందుబాటులో ఉండట్లేదని, అందుకే తాము ప్రైవేటు సిలబస్ పుస్తకాలను వినియోగిస్తున్నామని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పాఠశాల విద్యా శాఖకు తెలియజేశాయి. దీంతో ముందుగా మార్కెట్‌లో విక్రయించే పాఠ్య పుస్తకాల ముద్రణను పక్కాగా చేపట్టేలా చర్యలు చేపట్టాలని భావిస్తోంది. ప్రైవేట్ పబ్లిషర్లు నిర్ణీత పాఠ్య పుస్తకాల ముద్రణ కోసం అనుమతి తీసుకొని, వాటికి విద్యా శాఖకు రాయల్టీ చెల్లిస్తున్నా, నిర్ణీత పుస్తకాలు ముద్రించడం లేదన్న ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు సేల్ పుస్తకాల ముద్రణను పక్కాగా చేసేలా, ఆయా పుస్తకాలకు సీరియల్ నంబర్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని భావిస్తోంది. తద్వారా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠ్య పుస్తకాలను మార్కెట్‌లో అందుబాటులో ఉంచి పాఠశాలలు వాటిని అమలు చేసేలా చూసేందుకు సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పాఠశాల విద్య కమిషనర్ విజయ్‌కుమార్ గుర్తింపు పొందిన ప్రైవేటు యాజమాన్య సంఘంతో (ట్రస్మా) చర్చించారు. వారు కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 5వ తరగతి వరకు కచ్చితంగా పాఠశాల విద్యా శాఖ నిర్దేశిత పుస్తకాలనే వినియోగిస్తామని రాత పూర్వకంగా హామీ ఇచ్చారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో అదే విధానం కొనసాగించడం ద్వారా ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాలను వినియోగం తగ్గించి, విద్యా ర్థుల బ్యాగు బరువును నియంత్రించొచ్చని భావిస్తోంది.

Government Textbooks for Private Primary SchoolsRelated Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రైవేట్ ప్రైమరీ స్కూళ్లకూ ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.