కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై అధిష్ఠానం సీరియస్

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో భారతీయ జనతా పార్టీనే ప్రత్యామ్నాయమంటూ మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించినట్టుగా తెలిసింది. దీంతో పిసిసి క్రమశిక్షణ సంఘం కోమటిరెడ్డికి త్వరలోనే షోకాజ్ నోటీసు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. టిఆర్‌ఎస్‌కు బిజెపినే ప్రత్యామ్నాయం అన్న రాజగోపాల్ మరో అడుగు ముందుకు వేసి ప్రధాని నరేంద్ర మోదీని పొగడ్తలతో ముంచేత్తారు. మోడీ సాహసోపేత […] The post కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై అధిష్ఠానం సీరియస్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.


మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో భారతీయ జనతా పార్టీనే ప్రత్యామ్నాయమంటూ మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించినట్టుగా తెలిసింది. దీంతో పిసిసి క్రమశిక్షణ సంఘం కోమటిరెడ్డికి త్వరలోనే షోకాజ్ నోటీసు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. టిఆర్‌ఎస్‌కు బిజెపినే ప్రత్యామ్నాయం అన్న రాజగోపాల్ మరో అడుగు ముందుకు వేసి ప్రధాని నరేంద్ర మోదీని పొగడ్తలతో ముంచేత్తారు. మోడీ సాహసోపేత నిర్ణయాల వల్ల అన్ని రంగాల్లో దేశానికి గుర్తింపు లభించిందని, అందుకే ప్రజలు ఆ పార్టీకి మరోసారి పట్టం కట్టారని కోమటిరెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతోపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉందని, రానున్న రోజుల్లో మరింత అధ్వానంగా మారే అవకాశం ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర నాయకత్వం తప్పిదాలే ఈ దుస్థితికి కారణమంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న అధిష్టానం దీనిపై నివేదిక వెంటనే ఇవ్వాలని రాష్ట్ర పార్టీని కోరినట్టుగా తెలిసింది. అయితే ఆదివారం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఢిల్లీ వెళ్లినట్టుగా తెలిసింది. ఆయన ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది.
గతంలో పార్టీ నాయకత్వంపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు
రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిని మారిస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్ పార్టీలోకి వెళ్లే వారు కాదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. ఇప్పటికే దీనిపై పూర్తి స్థాయి వివరాలను అధిష్టానం సీనియర్ నాయకుల ద్వారా ఆరా తీసినట్టుగా తెలిసింది. మరోసారి ఇలాంటి చర్యలు పునరావృత్తం కాకుండా చూడాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించినట్టుగా సమాచారం. దీంతో పాటు టిఆర్‌ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల విషయమై కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలిసింది. దీంతో రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నట్టుగా సమాచారం. రానున్న రోజుల్లో పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని, యువరక్తానికి పూర్తి స్థాయిలో అవకాశం ఇవ్వాలని కూడా అధిష్టానం భావిస్తున్నట్టుగా సీనియర్ నాయకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డిపై చర్యలు తీసుకుంటుందా, పిసిసి అధ్యక్షుడిని మారుస్తుందా అన్న విషయాలు తెలియాలంటే రెండు, మూడు రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుందని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు అభిమానులు ఉన్నారు. గతంలో పార్టీ నాయకత్వంపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో షోకాజ్ నోటీసుతోనే సరిపెడతారని కొందరు నాయకులు పేర్కొంటుండగా, మరికొందరు మాత్రం ఆయన్ను పార్టీ నుంచి తప్పిస్తారని జోస్యం చెప్తున్నారు.

T Congress serious on Komatireddy Rajagopal Reddy

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై అధిష్ఠానం సీరియస్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: