కెసిఆర్‌కు కేంద్రం లేఖ

19న పార్టీల అధ్యక్షులతో సమావేశానికి ఆహ్వానం మనతెలంగాణ/హైదరాబాద్ : సిఎం కెసిఆర్‌కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి లేఖ రాశారు. పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల అధ్యక్షులతో ఈనెల 19వ తేదీన కేంద్రం ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. పార్లమెంట్‌లోని లైబ్రరీ భవనంలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సమావేశానికి హాజరుకావాలని లేఖ ద్వారా కేంద్రం ఆయా పార్టీల అధ్యక్షులను ఆహ్వానించింది. తెలంగాణ సిఎం కెసిఆర్, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు […] The post కెసిఆర్‌కు కేంద్రం లేఖ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

19న పార్టీల అధ్యక్షులతో సమావేశానికి ఆహ్వానం
మనతెలంగాణ/హైదరాబాద్ : సిఎం కెసిఆర్‌కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి లేఖ రాశారు. పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల అధ్యక్షులతో ఈనెల 19వ తేదీన కేంద్రం ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. పార్లమెంట్‌లోని లైబ్రరీ భవనంలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సమావేశానికి హాజరుకావాలని లేఖ ద్వారా కేంద్రం ఆయా పార్టీల అధ్యక్షులను ఆహ్వానించింది. తెలంగాణ సిఎం కెసిఆర్, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు జగన్‌లకు కేంద్రం లేఖ రాసింది. అయిదు లక్ష్యాల సాధన కోసం అన్నిపార్టీల అధ్యక్షులతో నిర్వహించే ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ హాజరుకానున్నారు. అజెండాలో తొలి అంశం: పార్లమెంట్ ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు చర్యలు, రెండో అంశం: ఒకే దేశం ఒకే ఎన్నికలు, మూడో అంశం: 75 ఏళ్ల స్వాతంత్య్రం సందర్భంగా నవభారత నిర్మాణం, నాలుగో అంశం: మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకల నిర్వహణ, ఐదవ అంశం: వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి దోహదపడే రాష్ట్ర నిర్ణయాలు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై సూచనలు ఇవ్వాలని ఆ లేఖలో కేంద్రం కోరింది. ఈ ఐదు అంశాలపై చర్చించేందుకు హాజరుకావాలని ఆయా పార్టీల అధినేతలను కేంద్రం ఆహ్వానించింది. ఈ నెల 19న ప్రధాని మోదీ ఈ ఐదు లక్ష్యాల సాధన కోసం అన్ని పార్టీల అధ్యక్షులతో సమావేశం కానున్నారు.

 Minister Pralhad Joshi Write A Letter To Cm Kcr

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కెసిఆర్‌కు కేంద్రం లేఖ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.