నేడు విజయవాడకు సిఎం కెసిఆర్

‘కాళేశ్వరం’ ప్రారంభోత్సవానికి ఎపి సిఎంకు ఆహ్వానం విభజన సమస్యలపై చర్చించనున్న ఇరువురు సిఎంలు మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా మిగిలిపోయిన విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మరో సారి చర్చించనున్నారు. ఈ నెల 21న నిర్వహించనున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎపి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డిని ఆహ్వానించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం విజయవాడకు వెళ్లనున్నా రు. ఈ సందర్భంగా ఇరువురు ముఖ్యమంత్రులు రాష్ట్ర విభజన వివాదాలపై మరోసారి చర్చలు […] The post నేడు విజయవాడకు సిఎం కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

‘కాళేశ్వరం’ ప్రారంభోత్సవానికి ఎపి సిఎంకు ఆహ్వానం
విభజన సమస్యలపై చర్చించనున్న ఇరువురు సిఎంలు
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా మిగిలిపోయిన విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మరో సారి చర్చించనున్నారు. ఈ నెల 21న నిర్వహించనున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎపి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డిని ఆహ్వానించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం విజయవాడకు వెళ్లనున్నా రు. ఈ సందర్భంగా ఇరువురు ముఖ్యమంత్రులు రాష్ట్ర విభజన వివాదాలపై మరోసారి చర్చలు జరపనున్నారు. సోమవారం మధ్యాహ్నం 12.05 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడకు బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడి నుంచి విజయవాడలోని గేట్ వే హోటల్‌కు చేరుకుని అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకోనున్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయంలో దర్శనం చేసుకుంటారు.

అక్కడి నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు తాడేపల్లిలోని ఎపి సిఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారిక నివాసానికి చేరుకుని కాళేశ్వరం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించనున్నా రు. అక్కడే మధ్యాహ్న భోజనం చేసి తిరిగి విజయవాడలోని గేట్ వే హోటల్‌కు చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి వెళ్లి విశాఖ శ్రీ శారదాపీఠ ఉత్తరాధికారి శిష్య తుర్యాశ్రమ ధీక్ష స్వీకరణ మహోత్సవంలో పాల్గొంటారు. అక్కడి నుంచి రాత్రి 7.30 గంటలకు విజయవాడలోని అంతర్జాతీయ విమనాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టు చేరుకుంటారు. అనంతరం బేగంపేట నుంచి నేరుగా ప్రగతిభవన్‌కు చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
విభజన సమస్యలపై మరోసారి చర్చించనున్న ఇరువురు సిఎంలు
హైదరాబాద్‌లో ఎపి కార్యాలయాల నిర్వహణ కోసం కేటాయించిన భవనాలు గత నాలుగేళ్లుగా నిరుపయోగంగా ఉండటంతో వాటిని తెలంగాణకు అప్పగిస్తూ ఇరు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల సిఎంల మధ్య ఇప్పటివరకు జరిగిన చర్చల ఫలితంగానే ఈ మేరకు ముందడుగు పడింది. ప్రధానంగా షెడ్యూల్ 9, 10లోని ప్రభుత్వరంగ సంస్థల విభజన, విద్యుత్ ఉద్యోగుల పంపకాలు, విద్యుత్ బిల్లుల బకాయిలు తదితర సమస్యలను రెండు రాష్ట్రాలు పరిష్కరించుకోవాల్సింది. సోమవారం మళ్లీ రెండు రాష్ట్రాల సిఎంలు సమావేశం కానుండటంతో మరికొన్ని సమస్యలకు పరిష్కారం లభించే అవకాశాలున్నాయి.

Cm KCR to visit Vijayawada today

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నేడు విజయవాడకు సిఎం కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: