భర్త ఇంటి ఎదుట భార్య నిరసన

మనతెలంగాణ/హసన్‌పర్తి : ఐదేళ్ళ క్రితం రూ.20 లక్షల కిమ్మత్తు కట్నం తీసుకొని పెళ్లి చేసుకున్న భర్త వేధిస్తున్నాడని అతని ఇంటి ముందు నిరసన తెలిపిన ఓ మహిళ ఒక దశలో ఒంటిమీద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 1వ డివిజన్ పైడిపల్లికి చెందిన నేరాండ్ల ప్రేమలత ముదిరాజ్‌కు ఐదేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన నేరాండ్ల వేణుతో వివాహం జరిగింది. ఐదు సంవత్సరాల కాలంలో మూడు నెలలు మాత్రమే వారి కాపురం సజావుగా […] The post భర్త ఇంటి ఎదుట భార్య నిరసన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మనతెలంగాణ/హసన్‌పర్తి : ఐదేళ్ళ క్రితం రూ.20 లక్షల కిమ్మత్తు కట్నం తీసుకొని పెళ్లి చేసుకున్న భర్త వేధిస్తున్నాడని అతని ఇంటి ముందు నిరసన తెలిపిన ఓ మహిళ ఒక దశలో ఒంటిమీద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 1వ డివిజన్ పైడిపల్లికి చెందిన నేరాండ్ల ప్రేమలత ముదిరాజ్‌కు ఐదేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన నేరాండ్ల వేణుతో వివాహం జరిగింది. ఐదు సంవత్సరాల కాలంలో మూడు నెలలు మాత్రమే వారి కాపురం సజావుగా సాగింది. వేణు చైన్నైలో సిఎస్ ఐఎఫ్ బ్రాంచి పోలీస్ కానిస్టేబుల్‌గా వేణు విధులు నిర్వహిస్తున్నాడు. ఓ పండుగకు భార్యను స్వగ్రామానికి తీసుకువచ్చి ఒదిలేసి వెళ్లాడు. చెన్నైలో ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడని ప్రేమలత ఆరోపించింది. కేవలం కట్నం కోసమే తనను పెళ్లి చేసుకున్నాడని తన జీవితం ఆగం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. చావైనా రేవైనా అతనితోనే బతుకుతానని చెప్పింది.
అదనపు కట్నం కోసమే మా కూతుర్ని వేధిస్తున్నాడు
పెళ్లి సమయంలో కట్నం కింద రూ.10 లక్షల నగదు, 250 గజాల ప్లాటు, 5 తులాల బంగారం ఇచ్చినట్లు ప్రేమలత తండ్రి రవీందర్ చెప్పారు. ఇప్పుడు కాపురానికి తీసుకుపొమ్మంటే మరో రూ.20 లక్షల అదనపు కట్నం ఇవ్వాలని అల్లుడు వేణు వేధిస్తున్నాడని తెలిపాడు. హసన్‌పర్తి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడుతుండగానే ప్రేమలత తన అత్తగారి ఇంట్లోకి వెళ్లి కిరోసిన్ డబ్బా తెచ్చుకొని ఒంటి మీద పోసుకుంది. అగ్గిపెట్టలోని ఓ అగ్గిపుల్ల తీసుకొని అంటించుకోపోతుంటే పక్కనే ఉన్న పోలీసులు, స్థానికులు అడ్డుకుని కాపాడారు.

Wife Protest In Front Of Husband House

Related Images:

[See image gallery at manatelangana.news]

The post భర్త ఇంటి ఎదుట భార్య నిరసన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.