నారాయణ నీట్ ర్యాంకర్‌కు రాష్ట్రపతి ఆహ్వానం

మనతెలంగాణ/హైదరాబాద్: నీట్ అలిండియాలో 7వ ర్యాంక్ సాధించిన నారాయణ విద్యాసంస్థల విద్యార్థి గంగదాసు మాధురిరెడ్డికి ఆగస్టు 15న ఢీల్లీ లో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనాల్సిందిగా రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆహ్వానం అందింది. ఈ మేరకు నారాయణ విద్యాసంస్ఠల మేనేజింగ్ డైరెక్టర్ డా.సింధూర నారాయణ ఆదివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. మాదాపూర్ నారాయణ మెడికల్ అకాడమీలో ఇంటర్ విద్యార్థి మాధురిరెడ్డి నీట్‌లో జాతీయస్థాయి 7వ ర్యాంకు తో పాటు బాలికల విభాగంలో ఆలిండియా ఫస్ట్ […] The post నారాయణ నీట్ ర్యాంకర్‌కు రాష్ట్రపతి ఆహ్వానం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మనతెలంగాణ/హైదరాబాద్: నీట్ అలిండియాలో 7వ ర్యాంక్ సాధించిన నారాయణ విద్యాసంస్థల విద్యార్థి గంగదాసు మాధురిరెడ్డికి ఆగస్టు 15న ఢీల్లీ లో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనాల్సిందిగా రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆహ్వానం అందింది. ఈ మేరకు నారాయణ విద్యాసంస్ఠల మేనేజింగ్ డైరెక్టర్ డా.సింధూర నారాయణ ఆదివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. మాదాపూర్ నారాయణ మెడికల్ అకాడమీలో ఇంటర్ విద్యార్థి మాధురిరెడ్డి నీట్‌లో జాతీయస్థాయి 7వ ర్యాంకు తో పాటు బాలికల విభాగంలో ఆలిండియా ఫస్ట్ అలాగే ఎంసి ఎంసెట్‌లో ఐదవ ర్యాంకును సాధించినట్లు తెలిపా రు. ఈ సందర్భంగా మాధురీ మాట్లాడుతూ స్కూల్ స్థాయి నుంచి నారాయణ విద్యా సంస్థలల్లోనే చదవుతున్నాని చెప్పారు. 9, 10వ తరగతుల్లోనే మెడి పార్క్ స్పార్క్ ప్రోగ్రామ్ ద్వారా తనకు ఇచ్చిన మెడికల్ కోచింగ్ అప్పుడే బెసిక్స్ కాన్సెప్టులు బాగా నేర్చుకున్నానని చెప్పారు. ఇంటర్ ఎన్ -40 ప్రోగ్రామ్‌లో నేర్చుకున్న బేసి క్స్ చాలా వరకు ఉపయోగపడ్డాయని తెలిపారు. రివిజన్ స్థాయిలో టెసులు ఎక్కువగా నిర్వహించడం వల్ల పరీక్షల్లో పెద్దగా భయం కలగలేదన్నా రు. ఒత్తిడి లేకుండా పరీక్ష రాసినట్లు చెప్పారు. నారాయణ కళాశాలల్లో అధ్యాపకులు ప్రేరణ కలిగించారన్నారు. డీన్స్, అధ్యాపకులు చిన్న చిన్న విషయాలు కూడా చాలా వివరంగా చెప్పేవారన్నారు. ఒత్తిడి లేకుండా కౌన్సిలింగ్ ఇచ్చేవారని తెలిపారు.

President  invitation to Narayana Neet Ranker

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నారాయణ నీట్ ర్యాంకర్‌కు రాష్ట్రపతి ఆహ్వానం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: