పారిశ్రామిక విధానంలో మార్పులు ?

  2014-19 విధానంలో రూ.1.63 లక్షల కోట్ల పెట్టుబడులు మేడ్చల్‌లో అత్యధికంగా 2525 కంపెనీల ఏర్పాటు మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర పారిశ్రామిక విధానంలో కొన్ని మార్పులు చేసి మరిన్ని పెట్టుబడులు వచ్చేలా చూడాలని సర్కార్ భావిస్తోంది. తెలంగాణ తొలి ప్రభుత్వం 2014-19 పారిశ్రామిక విధానాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీనిని పొడిగిస్తూ ఇటీవల ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఈ విధానం అత్యుత్తమమైందిగా పేరొందడంతో దీనిని కొనసాగిస్తున్నారు. కొన్ని మార్పులు చేసి మళ్లీ ఉత్తర్వులు జారీ […] The post పారిశ్రామిక విధానంలో మార్పులు ? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

2014-19 విధానంలో రూ.1.63 లక్షల కోట్ల పెట్టుబడులు
మేడ్చల్‌లో అత్యధికంగా 2525 కంపెనీల ఏర్పాటు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర పారిశ్రామిక విధానంలో కొన్ని మార్పులు చేసి మరిన్ని పెట్టుబడులు వచ్చేలా చూడాలని సర్కార్ భావిస్తోంది. తెలంగాణ తొలి ప్రభుత్వం 2014-19 పారిశ్రామిక విధానాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీనిని పొడిగిస్తూ ఇటీవల ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఈ విధానం అత్యుత్తమమైందిగా పేరొందడంతో దీనిని కొనసాగిస్తున్నారు. కొన్ని మార్పులు చేసి మళ్లీ ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ఉన్నతస్థాయి అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందులో యువకులు వెనకబడిన వర్గాలతోపాటు, వివిధ రంగాల్లోని ఇతర పెట్టుబడిదారులకు, విదేశీ ఇన్వెస్టర్లకు కొత్త రాయితీలు అందే అవకాశాలున్నాయి. తద్వారా రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు ఆకర్షించాలనేది ప్రభు త్వ ధ్యేయంగా ఉన్నట్లు తెలిసింది.

31 జిల్లాల్లో పెట్టుబడుల వరద
గత ఐదేళ్లలో కొత్త పారిశ్రామిక విధానం అమల్లోకి వచ్చిన తరవాత రాష్ట్రంలోని 31 జిల్లాల్లో పెట్టుబడుల వరదపారింది. వాటిల్లో అత్యధికంగా రూ. 11,435 కో ట్ల పెట్టుబడితో మేడ్చల్ జిల్లాలో సుమారు 2525 కంపెనీలు, అత్యల్పంగా వనపర్తిలో రూ.1245 కోట్ల పెట్టుబడితో 45 కంపెనీలు ఏర్పాటయ్యాయి. రంగారెడ్డి లాంటి జిల్లాల్లో అత్యధికంగా రూ. 40,278 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సుమారు 6 లక్షల 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు దొరికాయి. మొత్తం 87,500 మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి.

ఇక వివిధ సెక్టార్లలో పెట్టుబడుల తీరు చూస్తే అత్యధికంగా ఇంజినీరింగ్ రంగంలో రూ. 2805 కోట్ల పెట్టుబడులతో 2024 కంపెనీలు ఏర్పాటయ్యాయి. డిఫెన్స్ ఎక్విప్ మెంట్ రంగంలో అతి తక్కువగా రూ. 280 కోట్ల పెట్టుబడులతో ఒక కంపెనీ మనుగడలోకి వచ్చింది. ఈ రెండింటిలో కలిపి 38 ల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక రియల్ ఎస్టేట్, ఇండస్ట్రియల్ పార్క్, ఐటీ బిల్డింగ్స్ తదితర రంగాల్లో పెట్టుబడులు 33 వేలా 650 కోట్లకు పెరిగి 5 లక్షల 85 వేల మంది కార్మికులకు పని దొరికింది. కాగా థర్మల్ పవర్ సెక్టార్ లో పెట్టుబడులు అత్యధికంగా రూ. 61,368 కోట్లకు చేరాయి.

ఐదేళ్లలో రూ.1.63 లక్షల కోట్ల పెట్టుబడులు
గడచిన ఐదేళ్ల కాలంలో దాదాపు 9796 కంపెనీలు రూ. 1,63,493 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. వీటి ద్వారా 11,53,356 ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఇప్పటికే రూ. 75, 250 కోట్ల విలువైన 6783 పరిశ్రమలు ఆపరేషన్ మొదలుపెట్టాయి. వీటిలో ఇప్పటికే సుమారు 5,06,919 మంది నిరుద్యోగులకు ఉపాధి లభించింది. అలాగే రూ. 22, 244 కోట్ల విలువైన 639 కంపెనీల్లో త్వరలో ఉత్పత్తి మొదలు కాబోతోంది. వీటి ద్వారా 1,98,979 మంది ఉపాధి పొందే అవకాశాలు ఉన్నాయి. 26 వేల మందికి ఉపాధి కల్పిస్తూ రూ. 46 వేల కోట్ల పెట్టుబడితో సుమారు 616 కంపెనీల నిర్మాణ పనులు మొదలయ్యాయి. మరో రూ. 17 వేల కోట్ల పెట్టుబడితో దాదాపు 1730 కంపెనీల పనులు ప్రారంభం కావాల్సి ఉంది.

TS Govt to Investment Rs 1.63 lakh cr in 2014-19

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పారిశ్రామిక విధానంలో మార్పులు ? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: