అక్టోబర్ నాటికి యాదాద్రి గుడి రెడీ

  మంచి ముహూర్తం కోసం ఎదురుచూపు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్న సిఎంఓ అధికారి భూపాల్‌రెడ్డి చిన్న చిన్న పనులకు త్వరలో మోక్షం: వైటిడిఏ వైస్‌చైర్మన్ కిషన్‌రావు మనతెలంగాణ/హైదరాబాద్: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ విస్తరణ, పునర్నిర్మాణం పనులు అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని సిఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. యా దాద్రి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆర్‌అండ్‌బికి చెంది న పనులతో పాటు ఆలయ నిర్మాణ […] The post అక్టోబర్ నాటికి యాదాద్రి గుడి రెడీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మంచి ముహూర్తం కోసం ఎదురుచూపు
ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్న సిఎంఓ అధికారి భూపాల్‌రెడ్డి
చిన్న చిన్న పనులకు త్వరలో మోక్షం: వైటిడిఏ వైస్‌చైర్మన్ కిషన్‌రావు

మనతెలంగాణ/హైదరాబాద్: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ విస్తరణ, పునర్నిర్మాణం పనులు అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని సిఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. యా దాద్రి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆర్‌అండ్‌బికి చెంది న పనులతో పాటు ఆలయ నిర్మాణ పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మిగిలిన చిన్న చిన్న పనులను త్వరగా పూర్తి చేయాలని భూపాల్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రధాన ఆలయంలో పూర్తి చేయాల్సిన పనులతో పాటు ఆయా విభాగాల అధికారులకు బాధ్యతలు అప్పగించగా, ఆ పనులు ఎంతవరకు వచ్చాయన్న దానిపై భూపాల్‌రెడ్డి ఆరా తీశారు.

యాదాద్రి కొండపై ప్రధాన ఆలయం, మాఢవీధులతో పాటు పరిసరాల్లో అన్ని రకాల పనులు ఏకకాలంలో పూర్తి చేయాలని ఆయన సూచించారు. అక్టోబర్ నాటికి పనులు పూర్తి చేసుకొని స్వామివారి దర్శనమూర్తుల ప్రతిష్టలు, ఆలయ కుంభాభిషేక మహా యజ్ఞానికి సిద్ధంగా ఉండాలని ఆయన అధికారులకు సూచించారు. గర్భాలయ దర్శనాల ప్రారంభం, ఇతర ఆగమ వైదిక కార్యక్రమాలకు త్వరలో ముహూర్తం నిర్ణయిస్తారని వైటిడిఏ (యాదాద్రి డెవలప్‌మెంట్) వైస్ చైర్మన్ కిషన్‌రావు తెలిపారు. కిషన్‌రావు, ఆలయ ఈఓ గీతారెడ్డి ఆలయ అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మిగిలిన పనులను త్వరగా పూర్తి చేసి ఈ ఆలయాన్ని ప్రారంభించాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో పనుల గురించి ఎప్పటికప్పుడు సిఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. సుమారు మూడు సంవత్సరాల లోపే యాదాద్రి ఆలయం నిర్మాణ పనులు పూర్తి కావడం విశేషంగా చెప్పుకోవచ్చు. మంచి ముహూర్తం చూసుకొని ఈ ఆలయాన్ని ప్రారంభించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Yadadri temple renovation will be completed by October

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అక్టోబర్ నాటికి యాదాద్రి గుడి రెడీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.