అందాలతో మురిపిస్తోంది

  యంగ్ బ్యూటీ రష్మిక మందన్నకు ఇప్పుడు టాలీవుడ్‌లో బోలెడంత క్రేజ్ ఉందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిట్ మూవీ ‘ఛలో’తో తెరంగేట్రం చేసి ’గీత గోవిందం’తో బాక్సాఫీస్‌ని షేక్ చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. కుర్ర హీరోలకు మంచి ఆప్షన్ అయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు స్టార్ హీరోల దృష్టిలో కూడా పడింది. ఒక్కరు కాదు ఏకంగా ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో ఇదివరకే ఛాన్స్ దక్కించేసుకుంది. మహేష్‌బాబు […] The post అందాలతో మురిపిస్తోంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

యంగ్ బ్యూటీ రష్మిక మందన్నకు ఇప్పుడు టాలీవుడ్‌లో బోలెడంత క్రేజ్ ఉందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిట్ మూవీ ‘ఛలో’తో తెరంగేట్రం చేసి ’గీత గోవిందం’తో బాక్సాఫీస్‌ని షేక్ చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. కుర్ర హీరోలకు మంచి ఆప్షన్ అయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు స్టార్ హీరోల దృష్టిలో కూడా పడింది. ఒక్కరు కాదు ఏకంగా ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో ఇదివరకే ఛాన్స్ దక్కించేసుకుంది. మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో రష్మిక హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందే సినిమాలోనూ ఈ క్రేజీ భామనే హీరోయిన్.

ఇటీవలే లాంఛ్ అయిన నితిన్ ‘భీష్మ’ సినిమాలోనూ రష్మిక నటిస్తోంది. త్వరలో విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక చేతినిండా ఇన్ని సినిమాలతో బిజీగా ఉన్నా స్పెషల్ ఫోటో షూట్‌లతో ఆకట్టుకుంటోంది ఈ బ్యూటీ. తాజాగా రష్మిక ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. యూత్‌లో భారీ క్రేజ్ ఉన్న ఈ బ్యూటీ ఫొటోలు ఇప్పుడు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ఫొటోల్లో రష్మిక అందాలొలికిస్తూ యూత్‌ను మైమరపిస్తోంది. చిరునవ్వులు చిందిస్తూ మురిపిస్తోంది.

Rashmika Mandanna latest photoshoot still

The post అందాలతో మురిపిస్తోంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: