తాప్సీ నటనకు ప్రశంసలు

  తాజాగా విడుదలైన ‘గేమ్ ఓవర్’ సినిమాను సింగిల్ హ్యాండెడ్‌గా తాప్సీ తన భుజాల మీద మోసి ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఈ చిత్రం మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇక తాప్సీ కెరీర్‌లో ఈ చిత్రం ఓ స్పెషల్ మూవీగా నిలిచిపోయింది. ఈ అందాలతార తెలుగులో రెండేళ్ల క్రితం‘ఆనందో బ్రహ్మ’, గత ఏడాది ‘నీవెవరో’ మాత్రమే చేసింది. అందులో మొదటిది హిట్ కాగా రెండోది సక్సెస్‌ను దక్కించుకోలేదు. ఇక హిందిలో తాప్సీ ప్రస్థానం మహా భేషుగ్గా ఉంది. ‘పింక్’తో […] The post తాప్సీ నటనకు ప్రశంసలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

తాజాగా విడుదలైన ‘గేమ్ ఓవర్’ సినిమాను సింగిల్ హ్యాండెడ్‌గా తాప్సీ తన భుజాల మీద మోసి ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఈ చిత్రం మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇక తాప్సీ కెరీర్‌లో ఈ చిత్రం ఓ స్పెషల్ మూవీగా నిలిచిపోయింది. ఈ అందాలతార తెలుగులో రెండేళ్ల క్రితం‘ఆనందో బ్రహ్మ’, గత ఏడాది ‘నీవెవరో’ మాత్రమే చేసింది. అందులో మొదటిది హిట్ కాగా రెండోది సక్సెస్‌ను దక్కించుకోలేదు. ఇక హిందిలో తాప్సీ ప్రస్థానం మహా భేషుగ్గా ఉంది. ‘పింక్’తో మొదలైన జైత్రయాత్ర ఇప్పటి ‘గేమ్ ఓవర్’ దాకా కొనసాగుతోంది. మధ్యలో నామ్ షబానా, సుర్మ, మన్మరాజియా చిత్రాలు పరాజయం పాలైనా తనవరకు నటనా పరంగా క్రిటిక్స్ నుంచి మంచి పేరు తెచ్చుకుంది.

రిషి కపూర్‌తో పోటాపోటీగా నటించిన ‘ముల్క్’ సైతం బ్లాక్ బస్టర్ కాకపోయినా ఈ చిత్రం పర్వాలేదనిపించి విమర్శకుల ప్రశంసలను అందుకొని తాప్సీకి మంచి పేరును తీసుకువచ్చింది. ఇక ‘బదలా’ ఓ రేంజ్‌లో హిట్ కావడం అందులో ‘పింక్’ తర్వాత అమితాబ్ తో రెండోసారి నటించిన ఈ సినిమా వంద కోట్లకు చేరువగా వెళ్లడం విశేషం. ఇప్పుడు వచ్చిన ‘గేమ్ ఓవర్’ సైతం అంచనాలకు తగ్గట్టే సాగుతోంది. తాప్సీ నటన గురించి మాట్లాడిన తర్వాతే సినిమా గురించి చెప్పుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు తన ప్రభావం ఎంత ఉందో. ‘గేమ్ ఓవర్’ సక్సెస్ తర్వాత ఇప్పుడు తెలుగు నిర్మాతలు మళ్లీ తాప్సీకి ఆఫర్ల వర్షం కురిపిస్తారో లేదో చూడాలి.

Taapsee get success with game over movie

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post తాప్సీ నటనకు ప్రశంసలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: