చర్మం తేమను కోల్పోకుండా..

  ముఖాన్ని కాంతివంతం చేసే రహస్యం ఒకటుంది. అది మీ ముఖం కడుక్కునే విధానాన్ని మార్చుకోవడమే. ముఖ్యంగా రోజూ చేసుకునే మేకప్ వల్ల బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు తలెత్తడంతో పాటు, చర్మరంధ్రాలు మూసుకుపోతాయి. అప్పటికే ఉన్న మొటిమలు మరింత తీవ్రమవుతాయి. అలా పదేపదే ముఖం కడిగినా కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ప్రతి రోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించడానికి ముందు ముఖం కడుక్కోవడంలోని ఆవశ్యకత గురించి చాలా మందికి తెలుసు. అలా రాత్రివేళ కడగడం వల్ల తమ ముఖం శుభ్రంగానే […] The post చర్మం తేమను కోల్పోకుండా.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ముఖాన్ని కాంతివంతం చేసే రహస్యం ఒకటుంది. అది మీ ముఖం కడుక్కునే విధానాన్ని మార్చుకోవడమే. ముఖ్యంగా రోజూ చేసుకునే మేకప్ వల్ల బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు తలెత్తడంతో పాటు, చర్మరంధ్రాలు మూసుకుపోతాయి. అప్పటికే ఉన్న మొటిమలు మరింత తీవ్రమవుతాయి. అలా పదేపదే ముఖం కడిగినా కొన్ని సమస్యలు తలెత్తుతాయి.

ప్రతి రోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించడానికి ముందు ముఖం కడుక్కోవడంలోని ఆవశ్యకత గురించి చాలా మందికి తెలుసు. అలా రాత్రివేళ కడగడం వల్ల తమ ముఖం శుభ్రంగానే ఉందన్న కారణంతో ఉదయం వేళ ముఖం కడుక్కునే విషయంలో అంత శ్రద్ధ చూపరు. కానీ, రాత్రివేళ నిద్రపోతున్న సమయంలో శరీరం తనను తాను రిపేర్ చేసుకుంటుంది. ఈ స్థితిలో శరీరంలోని వ్యర్థాలు బయటికి విడుదల అవుతాయి. పగలంతా పనిచేస్తున్న సమయంలో శరీరంలోకి ప్రవేశించిన లేదా లోలోపల తయారైన విషపదార్థాలన్నీ బయటికి వెళతాయి. ఉదయం వేళ ముఖం కడుక్కున్నప్పుడు అవన్నీ తొలగిపోయి చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి.

మరీ ఎక్కువ వేడినీళ్లతో ముఖం కడుక్కోకూడదు. ఇలా చేయడం వల్ల శరీరంలో సహజసిద్ధంగా ఉండే కొన్ని నూనెలు బయటికి వెళ్లిపోతాయి. దీనివల్ల చర్మం పొడిబారిపోయి గరుకుగా మారుతుంది. ముఖాన్ని పొడిబారిపోయేలా చేసే సబ్బులు ఎప్పుడూ వాడకూడదు. వాటిలో ఉండే కొన్ని అంశాలు, చర్మంలోని ఆల్కలైన్ దాకా వెళ్లి, చర్మంలోని తేమను, అందులోని నూనెలను చర్మం గరుకుగా మారిపోయేలా చేస్తాయి. అలా తన తేమగుణాన్ని కోల్పోతే, చర్మం తన మృదుత్వాన్నీ కోల్పోతుంది.

Tips for beauty skin

Related Images:

[See image gallery at manatelangana.news]

The post చర్మం తేమను కోల్పోకుండా.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.