ఇక నుంచి డిగ్రీ లో 150 క్రెడిట్లు

అన్ని వర్సిటీల్లో ఒకే సిలబస్ అమలు సిబిసిఎస్ సమావేశంలో చర్చించిన నిపుణుల బృందం హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రతి డిగ్రీ కోర్సుకు మూడేళ్లలో 150 క్రెడిట్లు ఉండాలని నిపుణుల బృందం నిర్ణయిం. ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఆర్.లింబాద్రి అధ్యక్షతన జరిగిన సిబిసిఎస్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో కాకతీయ వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఆర్.సాయన్న, మహాత్మాగాంధీ వర్సిటీ విసి అల్తాఫ్ హుస్సేన్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్.శ్రీనివాస్‌తో […] The post ఇక నుంచి డిగ్రీ లో 150 క్రెడిట్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
అన్ని వర్సిటీల్లో ఒకే సిలబస్ అమలు
సిబిసిఎస్ సమావేశంలో చర్చించిన నిపుణుల బృందం

హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రతి డిగ్రీ కోర్సుకు మూడేళ్లలో 150 క్రెడిట్లు ఉండాలని నిపుణుల బృందం నిర్ణయిం. ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఆర్.లింబాద్రి అధ్యక్షతన జరిగిన సిబిసిఎస్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో కాకతీయ వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఆర్.సాయన్న, మహాత్మాగాంధీ వర్సిటీ విసి అల్తాఫ్ హుస్సేన్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్.శ్రీనివాస్‌తో పాటు వివిధ యూనివర్సిటీలకు చెందిన సబ్జెక్టులు పాల్గొని సిలబస్, కరికులమర్ తదితర అంశాలపై చర్చించారు.

2019-20 విద్యాసంవత్సరం నుంచి అమలు చేయనున్న ఒకే తరహా డిగ్రీ విధానంపై సమావేశంలో చర్చించారు. ఉపాధి అవకాశాలు కల్పించేలా విద్యార్థుల్లో ప్రతిభను నైపుణ్యాలు పెంపొందించడంపై చర్చించారు. రాష్ట్రంలో 2016-17 విద్యాసంవత్సరం నుంచి ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సిబిసిఎస్) అమలు చేస్తున్నారు. అందులో భాగంగా సెమిస్టర్ విధానం అమలవుతోంది. ఈసారి కొంత సిలబస్ తగ్గించి క్రెడిట్లను 150 క్రెడిట్లకు కుదించారు. నైపుణ్యాభివృద్ది, ఉపాధి కల్పించే కోర్సుల్లో భాగంగా అందుబాటులోకి తీసుకురావాల్సిన కోర్సులపై చర్చించారు.

డిగ్రీలో ఒకే తరహా విధానం

రాష్ట్రంలో ఒక్కో యూనివర్సిటీలో ఒక్కోరకమైన డిగ్రీ కోర్సులు, సిలబస్ ఉండేవి. పరీక్షలు, ప్రశ్నపత్రాల విధానమూ వేర్వేరుగా ఉండేవి. క్రెడిట్ల విషయంలో ఒక్కో వర్సిటీలో ఒక్కో విధానం ఉండేది. ఇదంతా గందరగోళంగా మారిందని భావించిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి, 201920 విద్యాసంవత్సరం నుంచి ఒకే విధానంలో ఉండే డిగ్రీ కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతోంది. గత విద్యాసంవత్సరమే దీనిపై కొంత అధ్యయనం చేసిన అధికారులు సంప్రదాయ డిగ్రీ కోర్సులైన బిఎ, బికాం, బిఎస్‌సిలను అందించే 6 రాష్ట్ర విశ్వవిద్యాలయాల పరిధిలో ఈసారి అమలు చేయనున్నారు. ఆయా సబ్జెక్టులపై ఏకాభిప్రాయానికి వచ్చేందుకు ఆయా వర్సిటీల అధికారులు, సబ్జెక్టు నిపుణులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చాలా సబ్జెక్టులు, క్రెడిట్లపై ఏకాభిప్రాయం వచ్చింది.

degree course requires 150 credits within three years

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఇక నుంచి డిగ్రీ లో 150 క్రెడిట్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: