గురుకులాల విద్యార్థుల హవా

 ఐఐటి జెఇఇలో 93 మందికి జాతీయ స్థాయి ర్యాంకులు ఏడాదికేడాది పెరుగుతున్న పాఠశాలల పనితీరు గత ఏడాది 36 ర్యాంకులు… ఈ ఏడాది 93 ర్యాంకులు 47 మందికి ఐఐటి అడ్మిషన్లు, మరి 46 మందికి ప్రిపరేటరీ కోర్సులు హైదరాబాద్ : ఐఐటి జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలల్లో గురుకుల పాఠశాలల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఈ ఏడాది సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థులు 93 మంది ఉత్తమ ర్యాంకులను సాధించారని గురుకుల విద్యా సంస్థల […] The post గురుకులాల విద్యార్థుల హవా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 ఐఐటి జెఇఇలో 93 మందికి జాతీయ స్థాయి ర్యాంకులు
ఏడాదికేడాది పెరుగుతున్న పాఠశాలల పనితీరు
గత ఏడాది 36 ర్యాంకులు… ఈ ఏడాది 93 ర్యాంకులు
47 మందికి ఐఐటి అడ్మిషన్లు,
మరి 46 మందికి ప్రిపరేటరీ కోర్సులు

హైదరాబాద్ : ఐఐటి జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలల్లో గురుకుల పాఠశాలల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఈ ఏడాది సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థులు 93 మంది ఉత్తమ ర్యాంకులను సాధించారని గురుకుల విద్యా సంస్థల అధికారులు తెలిపారు. ఇందులో సాంఘిక సంక్షేమానికి సంబంధించి 20 మంది విద్యార్థులు గిరిజన సంక్షేమ విద్యా సంస్థలకు చెందిన 27 మంది విద్యార్థులు ఐఐటిలో ప్రవేశాలకు అర్హతను సాధించారని తెలిపారు. మరో 46 మంది విద్యార్థులు ఐఐటి ప్రిపిరేటరీ కోర్సుల్లో ప్రవేశం కోసం వేచి చూస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వం ప్రతి పేద విద్యార్థి ఉన్నత విద్యతో పాటు నాణ్యమైన విద్యను అందించాలనే లక్షంతో ఏర్పాటు చేసిన గురుకులాల్లో విద్యార్థులు లక్ష సాధనకు అనుగుణంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. సాధారణ జీవితాన్ని గడిపే సాంఘిక, గిరిజన వర్గాలకు చెందిన వారి పిల్లలు జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించడం హర్షిందగిన విషయమన్నారు. ఇందులో ప్రధానంగా టీ కొట్టులు, పుట్‌పాత్ వ్యాపారులు, దినసరి కూలీలు, ఆటో డ్రైవర్లు, వ్యవసాయ కూలీలకు చెందిన వారి పిల్లలు గురుకులాల్లో చదివి జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభను కనబర్చారని తెలిపారు. ఇది వారి తల్లిదండ్రుల తీరని కలను నిజంగా చేసే విధంగా విద్యార్థులు ర్యాంకులను సాధించడంతో పాటు ఇటు ప్రభుత్వంతో పాటు అటు వారి తల్లిదండ్రులకు సైతం సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందనే అధికారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఊహించని విధంగా సాధించిన ర్యాంకుల వల్ల పిల్లల తల్లిదండ్రుల్లో ఎక్కడ లేని ఆనందం వెల్లివిరుస్తుందని అధికారులు తెలిపారు. ప్రధానంగా గిరిజన పాఠశాలలో చదివి 23వ ర్యాంకు సాధించిన ఎ.వెంకటేశ్ తండ్రి రెడ్యానాయక్ తమ కుమారుడు ఇటువంటి ప్రతిభను కనబరుస్తారని తాము ఊహించలేదని తెలిపారని అధికారులు తెలిపారు. అసలు తమ స్థాయి ఇటువంటి కోచింగ్‌కు ఇప్పించే పరిస్థితి లేదన్నారు. కనీసం ఉన్నత చదువులు చదివించే పరిస్థితి కూడా లేదని రెడ్యానాయక్ విద్యా సంస్థల అధికారుల ముందు చమర్చిన కళ్లతో తమ అభిప్రాయాన్ని వెల్లడించారన్నారు. ప్రభుత్వ సహకారం లేకపోతే ఈ రోజు తమ కుమారుడితో తాము ఇలా వచ్చి మాట్లాడే కలిగే వారం కాదన్నారు.

దీనికి పూర్తి సహాయ, సహకారం ప్రభుత్వంతో పాటు గురుకుల పాఠశాలల అధికారులదేనన్నారు. ఇది ఒక రెడ్యానాయక్‌కు సంబంధించిన కథనే కాదని గురుకులాల్లో ఐఐటిలో ఉత్తమ ర్యాంకులు ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలివేనన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కెజి టు పిజి విద్యలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి పేద విద్యార్థికి ఉచిత విద్యను అందించమే లక్షంగా సిఎం కెసిఆర్ తీసుకున్న గురుకులాల ఏర్పాటు పక్రియను సంస్థలతో పాటు ప్రభుత్వానికి కీర్తిని తీసుకువస్తున్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇందులో ప్రధానంగా గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ వీటి నిర్వహణతో పాటు గురుకులాల్లో ఉత్తమ విద్యను అందించేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నారు. పాఠశాలలకు చెందిన బోధన, బోధనేతర సిబ్బంది సమిష్టి కృషి ఫలితంగానే ఉత్తమ ఫలితాలను సాధనకు కారణమవుతున్నాయని అధికారులు తెలిపారు.

ఏడాదికేడాది గురుకుల విద్యా సంస్థల్లో విద్యార్థులు తమ ప్రతిభను మరింత గుర్తింపునిచ్చేలా ర్యాంకులను సాధిస్తున్నారని తెలిపారు. గత ఏడాది 36 ర్యాంకులను విద్యార్థులు సాధిస్తే ఈ ఏడాది వాటి సంఖ్య 93కు చేరిందన్నారు. గురుకులాల్లో విద్యార్థులను కేవలం పాఠ్యాంశాలకే పరిమితం చేయకుండా అన్ని రకాల అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రత్యేకంగా కోచింగ్‌ను అందిస్తూ విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకుల పంటలను సాధించేలా చర్యలు తీసుకుంటున్నారు.

గిరిజన పాఠశాలలకు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయిలో సాధించిన ర్యాంకుల వివరాలు వరుసగా….. ఎ.వెంకటేశ్ 23, కె.శ్రీనివాస్ కల్యాన్ 156, రాథోడ్, ఆనంద్ కిశోర్ 205, బి. అమరసింగ్ 258, ధరావత్ జగదీష్ 290, హెచ్.హేమంత్ 401 ర్యాంకులను సాధించారు. అదేవిధంగా సాంఘిక సంక్షేమ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయిలో సాధించిన ర్యాంకులు విద్వాన్ గగన్ 847, డి.ప్రవీణ్‌కుమార్ 1,170, రజినికేష్ వర్థన్ 1,170, హరీశ్వర్ 1,797, రవి 1,920, ప్రియన గుర్రాల 2,846 ర్యాంకులను సాధించారు.

IIT Jee Advanced Results 2019

Related Images:

[See image gallery at manatelangana.news]

The post గురుకులాల విద్యార్థుల హవా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.