లిస్బన్ పబ్‌లో అరాచకం…డాన్సర్‌పై దాడి

మన తెలంగాణ/హైదరాబాద్, సోమాజిగూడ: పబ్‌లో పనిచేసే డాన్సర్ చేత వ్యభిచారం చేయించాలని నిర్వాహకుడు ప్రయత్నించడంతో ఆమె ఒప్పుకోకపోవటంతో అక్కడ సిబ్బందితో వివస్త్రను చేసి దాడి చేయించిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పంజాగుట్ట పొలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలను ఏసీపీ తిరుపతన్న, ఇన్‌స్పేక్టర్ మోహన్ కుమార్‌తో కలసి వివరాలను వెల్లడించారు. కంట్రిక్లబ్‌లో గత కొన్ని సంవత్సరాలుగా లిస్బన్ రెస్టోబార్ పేరుతో మురళికృష్ణ పబ్‌ను నిర్వహిస్తున్నాడు. కస్టమర్లను ఆకట్టుకునేందుకుగాను పబ్‌లో మహిళా డాన్సర్‌లతో పాటు మహిళా […] The post లిస్బన్ పబ్‌లో అరాచకం…డాన్సర్‌పై దాడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/హైదరాబాద్, సోమాజిగూడ: పబ్‌లో పనిచేసే డాన్సర్ చేత వ్యభిచారం చేయించాలని నిర్వాహకుడు ప్రయత్నించడంతో ఆమె ఒప్పుకోకపోవటంతో అక్కడ సిబ్బందితో వివస్త్రను చేసి దాడి చేయించిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పంజాగుట్ట పొలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలను ఏసీపీ తిరుపతన్న, ఇన్‌స్పేక్టర్ మోహన్ కుమార్‌తో కలసి వివరాలను వెల్లడించారు. కంట్రిక్లబ్‌లో గత కొన్ని సంవత్సరాలుగా లిస్బన్ రెస్టోబార్ పేరుతో మురళికృష్ణ పబ్‌ను నిర్వహిస్తున్నాడు. కస్టమర్లను ఆకట్టుకునేందుకుగాను పబ్‌లో మహిళా డాన్సర్‌లతో పాటు మహిళా సిబ్బందిని ఏర్పాటు చేశాడు. ప్రతి నిత్యం పబ్‌కు వచ్చే కస్టమర్లకు మందు, విందుతో పాటు అనైతిక కార్యకలాపాలను నిర్వహించాలని మహిళా సిబ్బందిపై వత్తిడి తెచ్చేవాడని తెలిపారు. గత కొద్ది సంవత్సరాలుగా ఈ తంతు యథేచ్ఛగా కొనసాగుతున్నట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
గుంటూరు జిల్లాకు చెందిన హరిణి పొట్టకూటి కోసం జనవరి నెలలో లిస్బన్ బార్‌లో డాన్సర్‌గా చేరింది. ఈ క్రమంలో పబ్‌లోకి వచ్చే యువతకు ఇతర సేవలను చేయాలని నిర్వాహకుడు తన సిబ్బందితో కలసి ఆమెను బలవంతం చేయసాగాడు. దీంతో తాను ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడనని తెగేసి చెప్పినట్లు ఆమె తెలిపింది. కాగా ఇది మనసులో పెట్టుకున్న పబ్ ఇంచార్జ్ సిద్దు తోటి మహిళా సిబ్బందిచే కస్టమర్ల వద్దకు వెళ్లి వారిని అన్ని రకాలుగా సంతోష పెట్టాలని హరిణిని శుక్రవారం గట్టిగా ఆదేశించాడు. ఈ విషయంలో హరిణి మొండికేయడంతో శుక్రవారం అర్థరాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్ళేందుకు బయటకు వస్తుండగా పబ్‌లో పనిచేస్తున్న నలుగురు మహిళా సిబ్బంది మరో పురుష ఉద్యోగితో కలసి ఆమెపై దాడికి పాల్పడటమే కాక ఆమెను నడిరోడ్డుపై వివస్త్రను చేశారు. హరిణి పారిపోయి పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి పాల్పడ్డ తోటి మహిళా డాన్సర్‌లు స్వీటి, రీతు, మధు, విజయారెడ్డిలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు సయ్యద్ పరారీలో ఉన్నాడని పోలిసులు తెలిపారు. పబ్ నిర్వాహకులు మురళీకృష్ణ, పబ్ ఇంచార్జ్ సిద్ధ్దులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడ్డ వారిపై ఐపీసీ 354,323,506 ,509 రెడ్ విత్ 34 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.
నిత్యం నరకం చూపేవారు : బాధితురాలు
బతుకు దెరువుకు మరో దారి లేక తాను లిస్బన్ పబ్‌లో పనిచేసేందుకు ఒప్పుకున్నాని, తాను కేవలం డాన్స్ చేసేందుకు మాత్రమే ఉద్యోగంలో చేరానని బాధితురాలు తెలిపింది. పబ్‌లో అనునిత్యం అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, తనను కూడా బలవంతంగా వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేసేవారని ఆమె వాపోయింది. శుక్రవారం అర్థరాత్రి తాను పరాయి పురుషుడితో వ్యభిచరించేందుకు ఒప్పుకోకపోవడం తోటి సిబ్బంది తనపై దాడి చేశారని ఆమె ఆరోపించింది.
సహించేది లేదు: ఎసీపీ తిరుపతన్న
పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ సబ్ డివిజన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధ్దంగా పబ్‌లు, బార్‌లు నడిపిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పంజాగుట్ట ఎసీపీ తిరుపతన్న హెచ్చరించారు.పబ్ ముసుగులో అసాంఘిక కార్య కలాపాలను కొనసాగిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, దీంతో పబ్‌లపై ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సంఘటనకు కారకులైన వారిలో నలుగురిని రిమాండ్‌కు తరలించామని, మిగిలిన వారిని కూడా అరెస్టు చేస్తామని ఆయన వెల్లడించారు.

Bar dancer stripped and beaten up in Hyderabad

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post లిస్బన్ పబ్‌లో అరాచకం…డాన్సర్‌పై దాడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: