మల్లేశం భేష్

  సినిమా హృద్యంగా మానవీయంగా ఉంది ఈ సినిమాకు ట్యాక్స్ లేకుండా ప్రయత్నిస్తా చేనేత రంగానికి ప్రభుత్వం రూ. 1270 కోట్లు కేటాయించింది టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్ : సహజత్వానికి ఎంతో దగ్గరగా ‘మల్లేశం’ సినిమా ఉందని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రామానాయుడు ప్రివ్యూ థియేటర్ లో ‘మల్లేశం’ సినిమా ప్రివ్యూను కెటిఆర్ వీక్షించారు. చేనేత కళాకారుడు, పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా ఈ […] The post మల్లేశం భేష్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సినిమా హృద్యంగా మానవీయంగా ఉంది
ఈ సినిమాకు ట్యాక్స్ లేకుండా ప్రయత్నిస్తా
చేనేత రంగానికి ప్రభుత్వం రూ. 1270 కోట్లు కేటాయించింది
టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : సహజత్వానికి ఎంతో దగ్గరగా ‘మల్లేశం’ సినిమా ఉందని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రామానాయుడు ప్రివ్యూ థియేటర్ లో ‘మల్లేశం’ సినిమా ప్రివ్యూను కెటిఆర్ వీక్షించారు. చేనేత కళాకారుడు, పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ ఈ సినిమా ఎంతో హృద్యంగా, మానవీయంగా ఉందన్నారు.అంతరించిపోతున్న చేనేత కళకు ఈ చిత్రం జీవం పోసిందన్నారు. మల్లేశం సినిమా వెనకాల ఉన్న అజ్ఞాత సూర్యులను కెటిఆర్ ఈ సందర్భంగా ప్రశంసించారు. — ఎన్నో మానవ ఉద్వేగాలను క్యాప్చర్ చేసి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నందుకు ఆయన అభినందనలు తెలిపారు. ఎన్నో సన్నివేశాలు తనను ఆకట్టుకున్నాయని, -మరుగున పడిపోతున్న కళ, మరిచిపోతున్న కలగా చేనేత రంగంలోని కష్ట, నష్టాలను తెరపై చక్కగా ఆవిష్కరించారని ఆయన కొనియాడారు. – ఒక సామాన్యుడు ప్రతిభ పాఠవాలు చూపే క్రమంలో ఎదురయ్యే అడ్డంకులను దర్శకుడు తెరపై చూపించారన్నారు.- తెలంగాణ ప్రభుత్వం చేనేత కళాకారులకు ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.

చేనేత రంగానికి తెలంగాణ ప్రభుత్వం రూ. 1270 కోట్లు కేటాయిస్తే, అంతకుముందున్న ప్రభుత్వాలు బడ్జెట్ కేవలం 70 కోట్లే కేటాయించిందన్నారు. చేనేత రంగానికి ఇన్ని రేట్ల నిధులు పెంచిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. తల్లికష్టాన్ని చూసి బాధపడి, భాష, విషయం మీద పట్టు లేకపోయినా ఎంతో కష్టపడి ఎంతో మంది తల్లుల కష్టాన్ని ‘మల్లేశం’ సినిమా దూరం చేస్తుందన్నా రు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆత్మహత్య పరిష్కారం కాదని ఈ సినిమా చూపించిందన్నారు. సినిమాటోగ్రఫీ మంత్రితో మాట్లాడి మల్లేశం సినిమాకు ట్యాక్స్ లేకుండా చూసేందుకు ప్రయత్నం చేస్తామని ఆయన హామినిచ్చారు. ఇంత మంచి సినిమాను ఎంతో మంది చూడాల్సి న అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. చేనేతే కళాకారులకు అండగా ఉండేందుకు చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ జరగాలన్నారు. – ఇప్పటికే తనతో పాటు కొంతమంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరిస్తున్నారన్నారు. – దర్శి చాలా బాగా యాక్ట్ చేశాడని, – ఎంతో టాలెంటెడ్ రైటర్ పెద్దింటి అశోక్ చాలా బాగా డైలాగ్‌లు రాశాడని, – చిత్ర బృందం అందరికీ కెటిఆర్ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. – భారీ యూనిట్ ఏర్పాటు కోసం మల్లేశం సినిమాకు తెలంగాణ ప్రభుత్వం ఒక కోటి రూపాయల సాయం చేసిందన్నారు. కెటిఆర్‌తో పాటు ప్రొడ్యూసర్ సురేష్ బాబు, చిత్ర బృందం ఈ సినిమాను వీక్షించింది.

KTR speech At Mallesham Movie Press Meet

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మల్లేశం భేష్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: