కాంగ్రెస్ కథ కంచికే

మన తెలంగాణ/నల్లగొండ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేనేలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్య లు చేశారు. శనివారం ఆయ న నల్లగొండ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. నల్లగొండ జిల్లా మునుగోడు శాసనసభ్యుడిగా, అందులోనూ జిల్లాలో ఉన్న ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రాజగోపాల్‌రెడ్డి రాష్ట్రంలో అధికార టిఆర్‌ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ ఒక్కటే ప్రత్యామ్నయమని తేల్చిచెప్పారు. కాం గ్రెస్ పట్ల క్యాడర్‌కు నమ్మకం రోజురోజుకు సన్నగిల్లుతోందని, […] The post కాంగ్రెస్ కథ కంచికే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/నల్లగొండ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేనేలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్య లు చేశారు. శనివారం ఆయ న నల్లగొండ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. నల్లగొండ జిల్లా మునుగోడు శాసనసభ్యుడిగా, అందులోనూ జిల్లాలో ఉన్న ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రాజగోపాల్‌రెడ్డి రాష్ట్రంలో అధికార టిఆర్‌ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ ఒక్కటే ప్రత్యామ్నయమని తేల్చిచెప్పారు. కాం గ్రెస్ పట్ల క్యాడర్‌కు నమ్మకం రోజురోజుకు సన్నగిల్లుతోందని, అందుకే నేతలంతా ప్రత్యామ్నయ బిజెపి వైపే చూస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రం లో హస్తం గుర్తుపై గెలిచిన 12మంది శాసనసభ్యులు టిఆర్‌ఎస్‌లో చేరితే రాష్ట్ర నాయకత్వం కనీసం స్పందించలేదని, అదే సందర్భంలో అధిష్టానంలోని జాతీయ స్థాయి నాయకులు సైతం పట్టించుకోలేదంటూ విమర్శించారు . జాతీయ స్థాయిలో ఎఐసిసి అధినేత రాహుల్‌గాంధీ నాయకత్వం బలహీనపడిందని పార్టీ నాయకులు భావిస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నాయకత్వం వల్ల కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం చూకూరిందని, ఎఐసిసి దూత కుంతియా, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు తీసుకున్న ఏకపక్ష నిర్ణయాల వల్ల కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు కునారిల్లుతోందని స్పష్టం చేశారు. గతంలో పలుమార్లు రాష్ట్రంలో నాయకత్వ మార్పు పట్ల ముందే చెప్పినప్పటికీ పట్టించుకునేనాధుడే కరువయ్యాడని, సదరు ఫలితం ప్రస్తుతం చవిచూస్తున్నామంటూ గుర్తు చేశారు. ప్రస్తుతానికి పార్టీ మారే అలోచనమాత్రం తనకు లేదని, భవిష్యత్తులో మా నాయకులుతో మాట్లాడి తగిన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నయం బిజెపినే
రాష్ట్రంలో రెండో దఫా అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ పార్టీకి, కెసిఆర్ కుటుంబానికి ప్రత్యామ్నయంగా ఒక్క బిజెపికే సాధ్యమవుతుందని తన వ్యక్తిగత అభిప్రాయంగా రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. పెద్ద ఎత్తున పార్టీ ఎమ్మెల్యేలు బిజెపిలోకి వెళ్తుంటే నాయకత్వం కనీసం చర్చించకపోవడం పార్టీ క్యాడర్‌ను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. మహబూబ్‌నగర్‌లో డికె అరుణ లాంటి నాయకులు పార్టీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంటే ఎందుకు వెళ్ళారనే ఆలోచన చేయకపోవడం శోచనీయమని, ఒకసారి అధిష్టానం ఆలోచించాలంటూ సూచించారు. రాష్ట్ర నాయకత్వం గాంధీభవన్‌లో కూర్చొని ప్రెస్‌మీట్‌లు పెట్టడం మినహా ప్రజాక్షేత్రంలోకి వచ్చి పనిచేసే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కుంతియా, ఉత్తమ్‌ల నాయకత్వాన్ని కనీసం శాసనసభ ఎన్నికల తర్వాతనైనా మార్చి ఉంటే ఏడెనిమిది ఎంపిలైనా గెలుచుకునే వారమన్నారు. మోదీ సాహసోపేత నిర్ణయాలకు ప్రజల మద్దతు… దేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలకు ప్రజలు సంపూర్ణ మద్దతు పలికారని, తద్వారానే రెండో పర్యాయం కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిందన్నారు. దేశంలో యువత బిజెపి వైపు చూస్తుంది, సరైన సమయంలో నియోజకవర్గ ప్రజల క్షేమం, అభివృద్ధి కోసం నిర్ణయం తీసుకుంటానని తేల్చిచెప్పారు.

Komatireddy Rajagopal Reddy Comments On Congress

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కాంగ్రెస్ కథ కంచికే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: