సర్పంచ్ కు పవర్

సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు సంయుక్తంగా చెక్‌పవర్ రేపటి నుంచి అమలు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పలు సెక్షన్లు మన తెలంగాణ/హైదరాబాద్ : నూతన పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం రాష్ట్రంలోని సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు సంయుక్తంగా చెక్ పవర్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఒక గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అలాగే నూతన చట్టంలో కొన్ని సెక్షన్లను అదనంగా చేర్చుతూ గెజిట్‌లో నోటిఫై […] The post సర్పంచ్ కు పవర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు సంయుక్తంగా చెక్‌పవర్
రేపటి నుంచి అమలు
గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
కొత్తగా పలు సెక్షన్లు

మన తెలంగాణ/హైదరాబాద్ : నూతన పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం రాష్ట్రంలోని సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు సంయుక్తంగా చెక్ పవర్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఒక గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అలాగే నూతన చట్టంలో కొన్ని సెక్షన్లను అదనంగా చేర్చుతూ గెజిట్‌లో నోటిఫై చేసింది. ఇందులో 6 (10), 34, 37 (6), 43 (10), 47 (4), 70 (4), 113 (4), 114 (2), 141 సెక్షన్లను జోడించింది. గ్రామ పంచాయతీల్లో ఆడిటింగ్ బాధ్యతలను సర్పంచ్, పంచాయతీ కార్యదర్శలకు అప్పగించింది. గ్రామసభ ఉండాల్సిన కోరం తదితర ఇతర అంశాలను పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా కొత్త సెక్షన్లు ఈ నెల 17వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. కొత్త పంచాయతీ రాజ్ చట్టం తీసుకరావడానికి ముందు సర్పంచ్‌లకు, పంచాయతీ కార్యదర్శులకు కలిపి చెక్ పవర్ ఉండేది. అయితే అపుడు కార్యదర్శుల కొరతతో మూడు నాలుగు గ్రామాలకు కలిపి ఒకరే ఉండేవారు. ప్రస్తుతం కొత్త జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించుకున్నప్పటికీ వాళ్లందరిని మూడేళ్లు కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవడం, గ్రామ పాలన పట్ల వారికి పెద్దగా అవగాహన లేదు. దీంతో చట్టంలో పేర్కొన్న విధంగానే సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు జాయింట్‌గా చెక్ పవర్ ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పంచాయతీ రాజ్ చట్టంలో సర్పంచ్‌లు, ఉప సర్పంచ్ లకు చెక్ పవర్ అధికారాన్ని కల్పించింది. అయితే ఉప సర్పంచ్‌కు జాయింట్ చెక్ పవర్ అంశంపై ప్రజాప్రతినిధుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పైగా సంయుక్తంగా చెక్ పవర్ అధికారాన్ని కట్టబెట్టడం వల్ల పలు గ్రామాల్లో రాజకీయ విభేదాలు రాజేసినట్లవుతుందని వ్యాఖ్యానిం చారు.అయితే ముందుగా అనుకున్న దాని ప్రకారం చట్ట ప్రకారమే ముందుకు వెళ్లాలని సిఎం కెసిఆర్ నిర్ణయిం చారు. ప్రస్తుతం రాష్ట్రం వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటైన 4383 గ్రామపంచాయతీలతో కలుపుకు ని మొత్తం 13,073 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇటీవల మూడు విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించగా, కొత్త సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఫిబ్రవరి 2వ తేదీన తమ పదవి బాధ్యతలను స్వీకరించారు. ఇదిలా ఉండగా కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన రాష్ర్ట ప్రభుత్వం.. అందులో తొమ్మిది అంశాలను మాత్రం ప్రస్తుతం అమల్లోకి తేవడం లేదంటూ మినహాయింపు ఇచ్చింది.

ఇందులో ఉప సర్పంచ్‌కు చెక్ పవర్, ఆడిట్ పత్రాలు సమర్పించకపోతే సర్పంచ్, కార్యదర్శులను విధుల్లోంచి తొలగించటం, గ్రామాల్లో మొక్కల పెంపకానికి సంబంధించి కార్యదర్శిపై చర్యలు, సర్పంచ్‌లను సస్పెండ్ చేసేలా కలెక్టర్‌కు అధికారాలు, కార్యదర్శి తన పనితీరు నివేదికను బహిరంగుపర్చ కుంటే చర్యలు, లేఔట్లు, భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం సమకూర్చటం, పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ ఏర్పాటు, పంచాయతీలో ఓటర్ల సంఖ్యకు అనుగుుణంగా గ్రామసభ కోరం ఉండాలనే నిబంధనలను మినహాయించారు. అయితే ఇప్పుడు ఉప సర్పంచ్‌కు చెక్ పవర్‌పై సందిగ్ధం తొలగింది. అయితే గ్రామ కార్యదర్శులపై కఠిన చర్యలకు సంబంధించి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చెక్ పవర్ లేకున్నా కార్యదర్శులను ఆడిటింగ్ బాధ్యులను చేయటం, హరితహారం మొక్కల పెంపకంలో చర్యలు తీసుకునేలా నిబంధనపై విమర్శలు వస్తున్నాయి.

Telangana Issues Gazette Notification For Check Power To Sarpanch

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సర్పంచ్ కు పవర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.