తెలంగాణ రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గింది…

  హసన్‌పర్తి : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణలో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని తెలంగాణ హోంశాఖ మంత్రి మహముద్ అలీ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని హసన్‌పర్తి మాడల్ పిఎస్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మాడల్ పోలీస్‌స్టేషన్‌ను వర్ధన్నపేట ఎంఎల్‌ఎ ఆరూరి రమేష్, వరంగల్ ఎంపి పసునూరి దయాకర్‌తో కలిసి హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించడం జరిగిందన్నారు. సిఎం కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర పోలీస్‌శాఖకు అధిక నిధులు […] The post తెలంగాణ రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గింది… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హసన్‌పర్తి : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణలో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని తెలంగాణ హోంశాఖ మంత్రి మహముద్ అలీ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని హసన్‌పర్తి మాడల్ పిఎస్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మాడల్ పోలీస్‌స్టేషన్‌ను వర్ధన్నపేట ఎంఎల్‌ఎ ఆరూరి రమేష్, వరంగల్ ఎంపి పసునూరి దయాకర్‌తో కలిసి హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించడం జరిగిందన్నారు. సిఎం కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర పోలీస్‌శాఖకు అధిక నిధులు కేటాయించి, అధిక ప్రాధాన్యతను కల్పిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధికారులు, సిబ్బంది చేస్తున్న సేవలను ప్రత్యేకంగా అభినందించారు.

సిబ్బంది పనితీరును పరిశీలించి వృత్తి పరంగా నైపుణ్యాలను మెరుగు పరుచుటలో బాధితులకు మెరుగైన సేవలను అందించడం గర్వకారణంగా ఉందన్నారు. మొదటగా హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో రిసిప్షన్ కౌంటర్‌లో ఉన్న భాస్కర్ అనే కానిస్టేబుల్‌తో మాట్లాడి మాడల్ పిఎస్‌లోని సౌకర్యాలు, రికార్డులు, నిర్వహణను చూసి సంబరపడిపోయారు. అదేవిధంగా గదిలో ఉన్నటువంటి సిసి కెమెరాలు, మండలంలోని వివిధ గ్రామాలకు లింకు ఆధారంగా గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెనువెంటనే పరిశీలించుటకు సిసి కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు.

అనంతరం సిసి కెమెరాల గదిలోకి వెళ్లి వాటిని పరిశీలించారు. అనంతరం ఎస్సై సుధాకర్‌ను మండలంలో మీ పరిధి ఎంతవరకు ఉంది.. అని అడిగి తెలుసుకున్నారు. దీంతో స్థానిక సిఐ పుప్పాల తిరుమల్ మాట్లాడుతూ ఐదు గ్రామాలకు ఒక ఎస్సై చొప్పున ముగ్గురు ఎస్సైలు మండలంలోని అన్ని గ్రామాలలో విధులు నిర్వహిస్తున్నారన్నారు. అంతకుముందు సిపి విశ్వనాథ్ రవీందర్ మంత్రి మహముద్‌అలీకి తెలుగు అర్థం కాకపోవడంతో హిందీలో పోలీస్ శాఖ యొక్క విధి, విధానాలు, మాడల్ పోలీస్ వ్యవస్థను, ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను వివరించారు.

అనంతరం పోలీస్‌స్టేషన్ ఆవరణంలో మొక్కలను నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. అనంతరం పోలీస్ యొక్క గదులను, బీరువాలో ఉన్న రికార్డులను, క్యాప్‌లలో ఉన్న సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎసిపిలు, ఎస్సైలు సుధాకర్, రవీందర్, రాహుల్‌గైక్వాడ్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Number of Crime in Telangana State has Decreased

Related Images:

[See image gallery at manatelangana.news]

The post తెలంగాణ రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గింది… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: