ఖమ్మం పెద్దాసుపత్రిలో నలుగురు సస్పెన్షన్

మన తెలంగాణ/ఖమ్మం : ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది రోగుల పట్ల నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు చోటు చేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారుల ఆదేశాల మేరకు నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మహిళ డెలివరికి సంబంధించి వీడియో తీసి వాట్సాఫ్‌లలో పంపిన సంఘటనతో పాటు ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న బాలింతలకు హోంగార్డు స్లైన్ ఎక్కించటం […] The post ఖమ్మం పెద్దాసుపత్రిలో నలుగురు సస్పెన్షన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/ఖమ్మం : ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది రోగుల పట్ల నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు చోటు చేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారుల ఆదేశాల మేరకు నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మహిళ డెలివరికి సంబంధించి వీడియో తీసి వాట్సాఫ్‌లలో పంపిన సంఘటనతో పాటు ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న బాలింతలకు హోంగార్డు స్లైన్ ఎక్కించటం వంటి సంఘటనలపై విచారించిన అనంతరం ఈ చర్యలకు పూనుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్నతాధికారుల నిర్లక్షం కారణంగానే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో పనిచేస్తున్న రెగ్యులర్ స్టాఫ్ నర్సు నాగ శిరోమణి, కాంట్రాక్టు స్టాఫ్ నర్సు ధనలక్ష్మి, నర్సు జరీనాభేగం, కాంట్రాక్టు వైద్యురాలు రాజేశ్వరిలను సస్పెండ్ చేస్తూ అశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.
వైద్య ఉద్యోగుల ధర్నా..
వైద్య సేవల నిర్లక్షంపై ఒక వైద్యాధికారి, ముగ్గురు స్టాఫ్ నర్సులపై ఉన్నతాధికారులు తీసుకున్న చర్యలను నిరసిస్తూ శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది ధర్నా నిర్వహించారు. వైద్య సిబ్బందిని తొలగించటం అక్రమమని, వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు మద్ధతుగా టీఎన్‌జీవోస్, టీజీవోస్ రాష్ట్ర, జిల్లా నాయకులు సంఘీభావం తెలిపారు. వైద్య సేవల నిర్లక్షంపై వచ్చిన ఆరోపణల ఆధారంగా చర్యలు తీసుకోవటం అప్రజాస్వామికమని వారు ఆరోపించారు. ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని, వారికి తగ్గట్టుగా సిబ్బంది లేని కారణంగా ఉన్న సిబ్బందిపై పనిభారం పెరిగి ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రులలో పెరుగుతున్న రోగులకు అనుగుణంగా సిబ్బందిని కూడా నియమించాలని కోరారు. వారిని విధుల్లోకి తీసుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు.

ప్రభుత్వం ఉద్యోగులను లక్షంగా చేసుకుని మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఈ విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు, టీఎన్‌జీవోస్ జిల్లా అధ్యక్షులు పొట్టపింజర రామయ్యలు అన్నారు. ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకుని సహకరించాలని కోరారు. అనంతరం ఆసుపత్రి ఇంచార్జ్ సూపరిటెండెంట్, ఆర్‌ఎంవో డాక్టర్ కృపా ఉషశ్రీ ఆందోళనకారులతో చర్చించి ఉద్యోగుల డిమాండ్లను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నాయకులు శ్రీనివాసరావు, జైపాల్, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Four Employees Suspended in Khammam Govt Hospital

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఖమ్మం పెద్దాసుపత్రిలో నలుగురు సస్పెన్షన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: