తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు రిలీజ్

వరంగల్‌ : ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టిఎస్‌ ఐసెట్‌ ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు.  కెయులోని సెనెట్‌ హాలులో ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య టి.పాపిరెడ్డి, ఐసెట్‌ కన్వీనర్‌, కెయు విసి ఆచార్య ఆర్‌.సాయన్న విడుదల చేశారు. గత నెల 23, 24 తేదీల్లో మొత్తం 58  పరీక్షా కేంద్రాల్లో  ఈ పరీక్షను నిర్వహించారు. ఆన్ లైన్ లో నిర్వహించిన ఈ పరీక్షకు 49వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. అంతకుముందు […] The post తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు రిలీజ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

వరంగల్‌ : ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టిఎస్‌ ఐసెట్‌ ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు.  కెయులోని సెనెట్‌ హాలులో ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య టి.పాపిరెడ్డి, ఐసెట్‌ కన్వీనర్‌, కెయు విసి ఆచార్య ఆర్‌.సాయన్న విడుదల చేశారు. గత నెల 23, 24 తేదీల్లో మొత్తం 58  పరీక్షా కేంద్రాల్లో  ఈ పరీక్షను నిర్వహించారు. ఆన్ లైన్ లో నిర్వహించిన ఈ పరీక్షకు 49వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. అంతకుముందు ఐసెట్ ఫలితాల విడుదలను కెయు పరిశోధక సంస్థ విద్యార్థులు అడ్డుకున్నారు. ప్రవేశ ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేశారు. అధికారులతో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. దీంతో కొద్దిపాటి ఉద్రిక్తత నెలకొంది. సమస్య సద్దమణిగాక ఫలితాలను విడుదల చేశారు. ప్రవేశ పరీక్షలో 92.01 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మల్కాజ్‌గిరికి చెందిన మండవ హనీష్‌సత్య మొదటిర్యాంక్ సాధించారు. నాచారంకు చెందిన సూర్య ఉజ్వల్ నూకల రెండో ర్యాంక్, హైదరాబాద్ తిలక్‌నగర్‌కు చెందిన ప్రద్యుమ్నారెడ్డి మూడో ర్యాంక్ సాధించారు.

Telangana ICET Results Released

Related Images:

[See image gallery at manatelangana.news]

The post తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు రిలీజ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: