మున్సిపల్ ఎన్నికలపై టిఆర్‌ఎస్ గురి

– బలమైన అభ్యర్థులను నిలపడంపై దృష్టి – జులై 3తో ముగియనున్న పాలకవర్గ పదవీకాలం – ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం కసరత్తు మన తెలంగాణ/ఆదిలాబాద్ ప్రతినిధి :  అసెంబ్లీ, పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటిన అధికార టిఆర్‌ఎస్ పార్టీ మున్సిపాలిటీ ఎన్నికలపై దృష్టి సారించింది. రిజర్వేషన్లకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తుంది. ఎన్నికలు నిర్వహించేందుకు పురపాలక శాఖ ఇప్పటికే ప్రాథమిక కసరత్తు ప్రారంభించింది. పురపాలక శాఖ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు […] The post మున్సిపల్ ఎన్నికలపై టిఆర్‌ఎస్ గురి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

– బలమైన అభ్యర్థులను నిలపడంపై దృష్టి
– జులై 3తో ముగియనున్న పాలకవర్గ పదవీకాలం
– ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం కసరత్తు
మన తెలంగాణ/ఆదిలాబాద్ ప్రతినిధి :  అసెంబ్లీ, పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటిన అధికార టిఆర్‌ఎస్ పార్టీ మున్సిపాలిటీ ఎన్నికలపై దృష్టి సారించింది. రిజర్వేషన్లకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తుంది. ఎన్నికలు నిర్వహించేందుకు పురపాలక శాఖ ఇప్పటికే ప్రాథమిక కసరత్తు ప్రారంభించింది. పురపాలక శాఖ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ఎన్నికల నిర్వహణలో చేపట్టాల్సిన కార్యాచరణను రూపొందించింది. ఈ ప్రత్యేక విభాగం ఎప్పటికప్పుడు మార్దదర్శకాలు జారీ చేయనుంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆదిలాబాద్, నిర్మల్, బైంసా, మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల్లో ఎన్నికలతో పాటు నూతనంగా ఏర్పాటైన ఖానాపూర్ పురపాలక సంఘంలో సైతం ఎన్నికల నిర్వహణ కోసం కసరత్తు ప్రారంభించారు. ఇక ఆసిఫాబాద్, ఉట్నూర్‌లను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ షెడ్యూల్ ఏరియా కావడంతో చిన్నపాటి అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఎన్నికలలోగా ఈ విషయంపై స్పష్టత వస్తుందని భావిస్తుండగా, ఎన్నికలను నిర్వహించలేని పరిస్థితులలో ప్రత్యేకాధికారుల పాలనను కొనసాగించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక గతంలోనే బీసీ ఓటర్ల గణనకు షెడ్యూల్‌ను విడుదల చేసి ఇప్పటికే విలీన గ్రామాలతో పాటు పాత మున్సిపల్ పరిధిలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల గణన నిర్వహించారు. గణనకు సంబంధించిన వివరాలను విడుదల చేసి ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. ఈ అభ్యంతరాల ఆధారంగా మార్పులు, చేర్పులు చేపట్టి తుది జాబితాను రూపొందించి రాష్ట్ర కార్యాలయానికి అందించారు. ఈ గణన ఆధారంగానే జిల్లాలోని ఆయా మున్సిపాలిటీలకు చైర్మన్ సీట్లు రిజర్వు అవుతాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుత పాలకవర్గాల గడువు 2019 జులై 3 వరకు ఉండగా గడువులోగా ఎన్నికల ప్రక్రియ ఆరంభిస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. 2014 మార్చిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. కొత్త రాష్ట్రంలో ప్రభుత్వం కొలువు దీరాక పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించడంలో జాప్యం జరిగింది. ఈ క్రమంలో ఏడు నెలల ముందుగానే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కసరత్తు ఆరంభించారు. అయితే వరుస ఎన్నికలు రావడం, విలీన గ్రామాల విషయంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల వారు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించడంతో ఈ విషయంపై స్పష్టత రాలేదని అంటున్నారు. అయితే కోర్టు ఆదేశాలు ఎలా ఉన్నా సకాలంలో ఎన్నికలను నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో మున్సిపల్ అధికారులు సిద్దంగా ఉన్నారు. మున్సిపాలిటీల పరిధిలోని వార్డుల వారీగా ఓటర్ల గణనను పూర్తి చేసిన అధికార యంత్రాంగం ఆయా వార్డులను సైతం ఎవరికి కేటాయించాలనే విషయంపై దృష్టి సారించినట్లు చెబుతున్నారు. మరో 20 రోజులు మాత్రమే ప్రస్తుత పాలక వర్గాలకు గడువు ఉన్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

TRS Focus On Municipal Elections

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మున్సిపల్ ఎన్నికలపై టిఆర్‌ఎస్ గురి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: