జూనియర్‌ డాక్టర్లకు మమత వార్నింగ్‌…

కోల్‌కతా: బెంగాల్‌ జూనియర్‌ డాక్టర్లకు సిఎం మమతా బెనర్జీ వార్నింగ్‌ ఇచ్చారు. నిరసనను నిలిపివేసి 4 గంటల్లో విధుల్లో చేరాలని డాక్టర్లను మమత హెచ్చరించారు. ఎన్‌ఆర్‌ఎస్‌ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో మూడు రోజుల క్రితం ఓ రోగి చనిపోయాడు. దీంతో రోగి బంధువులు జూడాలపై దాడి చేశారు. ఆ సంఘటనకు నిరసనగా గత మూడు రోజుల నుంచి జూడాలు ఆందోళన చేస్తున్నారు. తమ డిమాండ్లను పోస్టర్ల రూపంలో మమత సర్కార్ కి తెలియజేశామని, తమకు న్యాయం చేయాలని […] The post జూనియర్‌ డాక్టర్లకు మమత వార్నింగ్‌… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కోల్‌కతా: బెంగాల్‌ జూనియర్‌ డాక్టర్లకు సిఎం మమతా బెనర్జీ వార్నింగ్‌ ఇచ్చారు. నిరసనను నిలిపివేసి 4 గంటల్లో విధుల్లో చేరాలని డాక్టర్లను మమత హెచ్చరించారు. ఎన్‌ఆర్‌ఎస్‌ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో మూడు రోజుల క్రితం ఓ రోగి చనిపోయాడు. దీంతో రోగి బంధువులు జూడాలపై దాడి చేశారు. ఆ సంఘటనకు నిరసనగా గత మూడు రోజుల నుంచి జూడాలు ఆందోళన చేస్తున్నారు. తమ డిమాండ్లను పోస్టర్ల రూపంలో మమత సర్కార్ కి తెలియజేశామని, తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్‌ చేశారు. దీంతో రంగంలోకి దిగి వారి వద్దకు మమతా బెనర్జీ వెళ్లారు.

తమకు న్యాయం కావాలని ఆమె ఎదుట జూడాలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బెంగాల్ సిఎం మాట్లాడుతూ.. ఎవరైతే డ్యూటీలో చేరాలనుకోవడం లేదో వారు ఆస్పత్రి నుంచి వెళ్లిపోవచ్చని ఆమె తేల్చిచెప్పారు. ఇటువంటి నిరసనలను తమ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోదని మండిపడ్డారు. ధర్నాకు దిగిన డాక్టర్ల చర్యను దీదీ తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. విధి నిర్వహణలో పోలీసులు ఎంతో మంది చనిపోతున్నారు. వారు కూడా మీలాగే ధర్నాలకు దిగుతున్నారా? అని మమత వాళ్లను సూటిగా ప్రశ్నించారు.

 

Mamata Banerjee Warns To Junior Doctors

Related Images:

[See image gallery at manatelangana.news]

The post జూనియర్‌ డాక్టర్లకు మమత వార్నింగ్‌… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: