కార్య‌క‌ర్త‌ల వ‌ల్లే పార్టీ విజ‌యం సాధించ‌లేదు: ప్రియాంకా గాంధీ

రాయ్‌బ‌రేలీ: కార్య‌క‌ర్త‌ల వ‌ల్లే కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించ‌లేక‌పోయింద‌ని ప్రయాంకా గాంధీ అన్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ కార్యకర్తలకు ప్రియాంకా గాంధీ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ యుపిలోని రాయ‌బ‌రేలీలో గురువారం స‌మావేశం నిర్వ‌హించింది. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఓడిన సంగతి తెలిసిందే. కాగా, ఆ ఓట‌మిపై ప్రియాంక కామెంట్స్ చేశారు. త‌న‌లో ఉన్న అస‌హ‌నాన్ని మొత్తం కాంగ్రెస్ కార్య‌కర్త‌ల‌పై చూపించారు. సోనియా గాంధీ నియోజ‌క‌వ‌ర్గమైన రాయ్‌బ‌రేలీలో ప్రియాంకా అసంతృప్తితో మాట్లాడారు. తాను నిజాలు మాట్లాడుతాన‌ని, త‌న […] The post కార్య‌క‌ర్త‌ల వ‌ల్లే పార్టీ విజ‌యం సాధించ‌లేదు: ప్రియాంకా గాంధీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రాయ్‌బ‌రేలీ: కార్య‌క‌ర్త‌ల వ‌ల్లే కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించ‌లేక‌పోయింద‌ని ప్రయాంకా గాంధీ అన్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ కార్యకర్తలకు ప్రియాంకా గాంధీ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ యుపిలోని రాయ‌బ‌రేలీలో గురువారం స‌మావేశం నిర్వ‌హించింది. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఓడిన సంగతి తెలిసిందే. కాగా, ఆ ఓట‌మిపై ప్రియాంక కామెంట్స్ చేశారు. త‌న‌లో ఉన్న అస‌హ‌నాన్ని మొత్తం కాంగ్రెస్ కార్య‌కర్త‌ల‌పై చూపించారు. సోనియా గాంధీ నియోజ‌క‌వ‌ర్గమైన రాయ్‌బ‌రేలీలో ప్రియాంకా అసంతృప్తితో మాట్లాడారు.

తాను నిజాలు మాట్లాడుతాన‌ని, త‌న మాట‌లు క‌ఠినంగా ఉంటాయంటునే ఘాట వ్యాఖ్య‌లు చేశారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల సమయంలో తూర్పు యుపి ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకా బాధ్య‌త‌లు చేపట్టిన సంగతి తెలిసిందే. పార్టీ మనుగడ కోసం బాధ్యతగా ప‌ని చేయ‌ని కార్య‌క‌ర్త‌ల‌ను గుర్తిస్తామన్నారు. మ‌త‌ప‌ర‌మైన ఉద్దేశంతో ప‌నిచేసిన వారి గురించి తెలుసుకున్నాం, కానీ పార్టీ గురించి ప‌నిచేయ‌ని కార్య‌క‌ర్త‌ల గురించి త్వరలో తెలుసుకుంటామని ఆమె పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో యుపిలోని రాయ్‌బ‌రేలీలో మాత్ర‌మే కాంగ్రెస్ విజయం సాధించింది.

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కార్య‌క‌ర్త‌ల వ‌ల్లే పార్టీ విజ‌యం సాధించ‌లేదు: ప్రియాంకా గాంధీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: