టిడిపి ఎంఎల్ఎలను లాగేద్దామన్నారు… : సిఎం జగన్

అమరావతి : ఎపి అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ స్పీకర్ గా తమ్మినేని సీతారాంను ఎన్నుకున్న అనంతరం సభలో సిఎం జగన్ మాట్లాడారు. గత చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఘాటైన విమర్శలు చేశారు. గత అసెంబ్లీ చేసిన దుర్మార్గాలను తమ సభ చేయదని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేసేందుకు కొందరు టిడిపి ఎంఎల్ఎలను వైసిపిలోకి లాగేద్దామని తమ పార్టీ నేతలు చెప్పారని, అందుకు తాను అంగీకరించలేదేని జగన్ చెప్పారు. […] The post టిడిపి ఎంఎల్ఎలను లాగేద్దామన్నారు… : సిఎం జగన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అమరావతి : ఎపి అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ స్పీకర్ గా తమ్మినేని సీతారాంను ఎన్నుకున్న అనంతరం సభలో సిఎం జగన్ మాట్లాడారు. గత చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఘాటైన విమర్శలు చేశారు. గత అసెంబ్లీ చేసిన దుర్మార్గాలను తమ సభ చేయదని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేసేందుకు కొందరు టిడిపి ఎంఎల్ఎలను వైసిపిలోకి లాగేద్దామని తమ పార్టీ నేతలు చెప్పారని, అందుకు తాను అంగీకరించలేదేని జగన్ చెప్పారు. టిడిపికి 23 మంది ఎంఎల్ఎలు ఉన్నారని, అందులో ఐదుగురిని లాగేస్తే, టిడిపికి 18 మందే మిగులుతారని, అప్పుడు చంద్రబాబకు ప్రతిపక్ష హోదా ఉండదని, తమ పార్టీ నేతలు చెప్పారని, అది పద్ధతి కాదని తాను చెప్పానని స్పీకర్ తమ్మినేనిని ఉద్దేశించి జగన్ చెప్పారు. తమ పార్టీ ఆచారం ప్రకారం ఎవరైనా వైసిపిలో చేరాలంటే ముందుగా వారు తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని, చంద్రబాబులా తాము ఎంఎల్ఎలను కొనుగోలు చేసే రకం కాదని ఆయన బాబుకు చురకలంటించారు. పదవులు అనుభవిస్తూ పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వారిని అనర్హులుగా ప్రకటించాలని జగన్ స్పీకర్ తమ్మినేనిని కోరారు.

AP CM Jagan Comments On TDP

Related Images:

[See image gallery at manatelangana.news]

The post టిడిపి ఎంఎల్ఎలను లాగేద్దామన్నారు… : సిఎం జగన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: