కిలాడీ లేడీ

విదేశీ పెళ్లి కుమారులను మోసం చేస్తున కిలాడీ అరెస్టు మ్యాట్రిమోని సైట్‌లో ప్రొఫైల్ చూసి గాలం వివాహం చేసుకుంటానని ఖరీదైన గిఫ్టులు వసూలు నకిలీ ఫొటోతో పెళ్లి కుమారులకు గాలం మోసపోయిన పలువురు యువకులు బాధితుడి ఫిర్యాదుతో వెలుగులోకి హైదరాబాద్: మ్యా ట్రిమోని వెబ్‌సైట్లలో నకిలీ ఫొటో, ప్రొఫైల్ పెట్టి విదేశాల్లో ఉంటున్న పెళ్లి కుమారులను మో సం చేస్తున్న కిలాడీ లేడిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితురాలి వద్ద నుంచి […] The post కిలాడీ లేడీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

విదేశీ పెళ్లి కుమారులను మోసం చేస్తున కిలాడీ అరెస్టు
మ్యాట్రిమోని సైట్‌లో ప్రొఫైల్ చూసి గాలం
వివాహం చేసుకుంటానని ఖరీదైన గిఫ్టులు వసూలు
నకిలీ ఫొటోతో పెళ్లి కుమారులకు గాలం
మోసపోయిన పలువురు యువకులు
బాధితుడి ఫిర్యాదుతో వెలుగులోకి

హైదరాబాద్: మ్యా ట్రిమోని వెబ్‌సైట్లలో నకిలీ ఫొటో, ప్రొఫైల్ పెట్టి విదేశాల్లో ఉంటున్న పెళ్లి కుమారులను మో సం చేస్తున్న కిలాడీ లేడిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితురాలి వద్ద నుంచి బ్యాంక్ పాస్ బుక్, చెక్‌బుక్స్ 16, ఎటిఎం కార్డులు 3 4, పాన్ కార్డులు 2, మొబైల్ ఫోకిలాడి లేడి సైబరాబాద్ సైబర్ క్రైం ఇన్స్‌స్పెక్టర్ రామయ్య కథనం ప్రకారం…ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లా , ఇన్మాడుగు సెంటర్, ఇంద్రలోక్ అవెన్యూకు చెందిన కోరం అర్చన(30) నగరంలోని బేగంపేట, లీలనగర్‌లోని వైభవ్ లేడిస్ హాస్టల్‌లో ఉంటోంది.

తెలుగు మ్యాట్రిమోని వెబ్ సైట్లలో తన పేరు పుష్‌టాయిగా పేర్కొని అందంగా ఉన్న వేరే యువతి ఫోటోను ప్రొఫైల్‌లో అప్‌లోడ్ చేస్తోంది. విదేశీల్లో ఉద్యోగం చేస్తున్న వారిని టార్గెట్ చేసి వారి ఫోన్ నంబర్ చూసి కాంటాక్ట్ అవుతోంది. తన నంబర్ చూసి కాంటాక్ట్ అయిన వారి తల్లిదండ్రులకు మీ కుమారుడిని వివాహం చేసుకునేందు ఇష్టంగా ఉన్నానని చెప్పడంతో వారు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న తమ కుమారుడి వివరాలు, ఫోన్ నంబర్ ఇచ్చారు. అప్పటి నుంచి యువకుడితో చాటింగ్ చేయడం కాల్స్ చేయడం ప్రారంభించింది. పెళ్లి కుమారుడు తన కుటుంబ ఆర్థిక పరిస్థితిని చెప్పాడు, అంతేకాకుండా ఫొటోలు కూడా పంపించాడు. ఎంగేజ్ మెంట్‌కు శారీ, బంగారు లేదా ప్లాటినమ్ రింగ్ తీసుకునేందుకు డబ్బులు పంపిచాల్సిందగా కోరింది.

వివాహానికి ముందు ఎలాంటి గొడవ ఉండకూడదని నమ్మి అమెరికాలో ఉన్న పెళ్లి కుమారుడు నిందితురాలి బ్యాంక్ ఖాతాకు రూ.1,50,000 పంపించాడు. తర్వాత నుంచి కాల్స్‌కు స్పందించడం ఆపివేసింది. యువకుడి తల్లిదండ్రులు నిందితురాలు ఇచ్చి చెన్నై చిరునామాకు వెళ్లి ఫోన్ చేయగా స్పందించలేదు. దీంతో తాము మోసపోయామని గ్రహించి సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేసి నిందితురాలిని అరెస్టు చేశారు.

విదేశీ పెళ్లికొడుకులే టార్గెట్…

కోరం అర్చన విదేశాల్లో ఉన్న వారినే టార్గెట్ చేసుకుని ఖరీదైన వస్తువులు వసూలు చేసి మోసం చేస్తోంది. తెలుగు మ్యాట్రిమోని సైట్స్‌లో తన పేరు కోరం అర్చన అలియాస్ జూటూరి వరప్రసాద్ అర్చన అలియాస్ జూటూరి ఇందిరప్రియదర్శిని అలియాస్ పుష్టాయిగా ప్రొఫైల్‌లో తన పేరును అప్‌లోడ్ చేస్తోంది. వివాహం తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావడంతో ఈ మార్గాన్ని ఎంచుకుంది. తన ఫొటోకు బదులుగా అందంగా ఉన్న యువతుల ఫొటోలను పెట్టి మోసం చేస్తోంది. విదేశాల్లో ఉన్న యువకుల తల్లిదండ్రులతో వివిధ మొబైల్ యాప్స్ సాకారంతో వివిధ గొంతులతో మాట్లాడుతోంది.

వివాహ చేసుకునేందుకు యువకుడి తల్లిదండ్రులు అంగీకరించగానే వారితో ఐదు రోజులు ప్రేమగా మాట్లాడుతుంది. తర్వాత తాను కొద్ది రోజులు మాత్రమే ఇండియాలో ఉంటానని అమెరికా నుంచి వస్తున్నానని తెలుపుతుంది. అప్పటి నుంచి వారి వద్ద నుండి డబ్బులు తన బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేయాలని డిమాండ్ చేస్తుంది. పిల్ల అందంగా ఉందని వారు డబ్బులు పంపించగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేస్తుంది. ఈ విధంగా చాలామంది విదేశీ పెళ్లి కుమారులను మోసం చేసి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసింది.

జైలుకు వెళ్లినా మారిన తీరు…

నెల్లూరుకు చెందిన అర్చన ఎస్‌వి యూనివర్సిటీలో ఎంబిఎ చేసింది. అదే జిల్లాకు రంగనాయకులపేట, గురుతోటకు చెందిన కోరం దుర్గాప్రవీణ్‌ను వివాహం చేసుకుంది. 2016వరకు లెక్చరర్‌గా పనిచేసిన అర్చన తర్వాత మానివేసింది. గతంలో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడగా సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. పోలీసులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు పంపించారు. 5 నెలల తర్వాత డిసెంబర్, 2018లో విడుదలైంది. అప్పటి నుంచి మళ్లీ మోసం చేయడం ప్రారంభించింది.

వెబ్ క్యామ్‌లో మాట్లాడాలిః రామయ్య, సైబర్ క్రైం ఇన్స్‌స్పెక్టర్

మ్యాట్రిమోని సైట్స్‌లో ఉన్న ఫొటోలు నకిలీవా అసలువా తెలుసుకునేందుకు గూగుల్ ఇమేజ్‌లో చెక్ చేసుకోవాలని సైబరాబాద్ సైబర్ క్రైం ఇన్స్‌స్పెక్టర్ రామయ్య తెలిపారు. వెబ్ కామ్ ద్వారా డైరెక్ట్‌గా యువతితో మాట్లాడాలని అన్నారు. విదేశీ నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌కు స్పందించవదన్నారు. కుటుంబ సభ్యుల వివరాలు, ఫొటోలు ఎట్టి పరిస్థితిలో పంపించకూడదని అన్నారు. వివాహం చేసుకునే యువతి డబ్బులు పంపించమని కోరితే పంపించకూడదన్నారు. మోసపోయిన వారు వెంటనే సైబర్ క్రైం పోలీసులను సంప్రదించాలని కోరారు.

Matrimonial Fraud

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కిలాడీ లేడీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: