స్మార్ట్ విలేజ్‌గా యాదాద్రి అభివృద్ధి

మూడునెలల్లో పనులు పూర్తి చేయాలి : సిఎస్ హైదరాబాద్: యాదాద్రి పట్టణాన్ని స్మార్ట్ విలేజీగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్ కె.జోషి అధికారులను ఆదేశించారు. దీనికి అవసరమైన పనులను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని, దానికోసం ప్రణాళిక రూపొందించు కోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్ కె.జోషి అధ్యక్షతన యాదాద్రి టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీ సమీక్ష కమిటీ సమావేశం బుధవారం సచివాలయంలో జరిగింది. యాదాద్రి పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, […] The post స్మార్ట్ విలేజ్‌గా యాదాద్రి అభివృద్ధి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
మూడునెలల్లో పనులు పూర్తి చేయాలి : సిఎస్

హైదరాబాద్: యాదాద్రి పట్టణాన్ని స్మార్ట్ విలేజీగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్ కె.జోషి అధికారులను ఆదేశించారు. దీనికి అవసరమైన పనులను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని, దానికోసం ప్రణాళిక రూపొందించు కోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్ కె.జోషి అధ్యక్షతన యాదాద్రి టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీ సమీక్ష కమిటీ సమావేశం బుధవారం సచివాలయంలో జరిగింది. యాదాద్రి పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కేబుల్స్, స్ట్రీట్ లైట్స్, సెంట్రల్ లైటింగ్ స్ట్రాం వాటర్ డ్రైన్స్, రోడ్లు, ఫుట్ పాత్, పార్కులు తదితర అభివృద్ధి పనులన్నీ త్వరితగతిన చేపట్టాలని సిఎస్ అధికారులను ఆదేశించారు.

వేద పాఠశాల నిర్మాణానికి 16 ఎకరాల దేవాదాయ భూమిని కేటాయించామని, ఆ పాఠశాల నిర్మాణానికి సంబంధించి నివేదికను సమర్పించాలని సిఎస్ అధికారులను కోరారు. బస్వాపూర్ ట్యాంకును టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. రాయగిరి, గండిచెరువు, పెద్దచెరువు, మల్లాపూర్ చెరువు, సైదాపూర్ చెరువుల అభివృద్ధి పనులకు సంబంధించి సిఎస్ సమీక్షించారు. టెంపుల్ ఆర్కిటెక్చర్ కళాశాల ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో సంబంధిత శాఖల అధికాలు పాల్గొన్నారు.

Develop Yadadri As Smart Village In Three Months

Related Images:

[See image gallery at manatelangana.news]

The post స్మార్ట్ విలేజ్‌గా యాదాద్రి అభివృద్ధి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: