ధాన్యం సేకరణ భళా

ధాన్యం సేకరణ అంతకంతకు పెంచుకున్న పౌరసరఫరాల శాఖ 201415లో 24.29 లక్షల మెట్రిక్ టన్నులు 201819లో 73.02 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం సేకరణ వార్షిక నివేదికను విడుదల చేసిన పౌరసరఫరాల శాఖ హైదరాబాద్: రైతుల నుంచి మద్ధతు ధరకు ధాన్యం సేకరణలో తెలంగాణ పౌర సరఫరాల శాఖ అంతకంతకు వృద్ధి చెందింది. రాష్ట్రం ఏర్పడిన తరువాత 201415లో 24.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల దగ్గర నుంచి సేకరిస్తే, 201819 ఖరీఫ్, రబీలలో 73.02 […] The post ధాన్యం సేకరణ భళా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ధాన్యం సేకరణ అంతకంతకు పెంచుకున్న పౌరసరఫరాల శాఖ
201415లో 24.29 లక్షల మెట్రిక్ టన్నులు
201819లో 73.02 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం సేకరణ
వార్షిక నివేదికను విడుదల చేసిన పౌరసరఫరాల శాఖ

హైదరాబాద్: రైతుల నుంచి మద్ధతు ధరకు ధాన్యం సేకరణలో తెలంగాణ పౌర సరఫరాల శాఖ అంతకంతకు వృద్ధి చెందింది. రాష్ట్రం ఏర్పడిన తరువాత 201415లో 24.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల దగ్గర నుంచి సేకరిస్తే, 201819 ఖరీఫ్, రబీలలో 73.02 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించింది. అంటే ఏకంగా మూడింతలు అధికంగా పెరగడం గమనార్హం. ఐదేళ్లలో పౌరసరఫరాల శాఖ చేపట్టిన సంస్కరణలు, ధాన్యం సేకరణపై బుధవారం వార్షిక నివేదికను విడుదల చేశారు. దీని ప్రకారం అన్నదాతల నుంచి వరిధాన్యం సేకరణ విషయంలో పౌరసరఫరాల శాఖ తీసుకుంటున్న చర్యలు భేష్‌గా ఉన్నాయి. ఒక్క 201516 వర్షాలు రాక, పంటలు సరిగ్గా పండలేదు.

ఆ ఒక్క ఏడాది మాత్రమే 23.55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఆ తరువాత 201617 ఖరీఫ్, రబీ రెండు సీజన్‌లలో కలిపి 53.69 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, 201718లో 53.98 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం సేకరించారు. ప్రతి సీజన్‌లో పౌరసరఫరాల శాఖ గ్రామ, మండల స్థాయిలో వేల సంఖ్యలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల దగ్గర నుంచి మద్ధతు ధరకు వరిని కొనుగోలు చేస్తోంది. ఇక కొనుగోలు చేసిన ధాన్యం విలువను చూస్తే 201415లో 24.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రూ.3392 కోట్లకు సేకరించగా, 201819 లో మే 22 వరకు ఉన్న సమాచారం మేరకు 73.02 లక్షల మెట్రిక్ టన్నులను రూ.12,906 కోట్లు ఖర్చు చేసినట్లు వార్షిక నివేదికలో పేర్కొన్నారు.

పైగా గడిచిన ఆర్థిక సంవత్సరం ప్రకారం మొత్తం ఆన్‌లైన్‌లో కొనుగోలు వివరాలు నమోదు చేసి, చెల్లింపులు కూడా ఆన్‌లైన్‌లోనే చేశారు. ఇలా సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కింద అర్హులైన వారికి ఇస్తున్నారు. గురుకుల హాస్టళ్లకు కూడా బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో రవాణా చేస్తున్న వాహనాలకు జిపిఎస్ సిస్టమ్‌ను ఆమర్చి ఎప్పటికప్పుడు ట్రాక్ చేసే సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పౌరసరఫరాల శాఖ నివేదికలో పేర్కొన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్నా భోజనానికి కూడా ఈ బియ్యాన్ని మాత్రమే వినియోగిస్తున్నారు.

గత ఐదేళ్లలో ధాన్యం సేకరణ వివరాలు

సంవత్సరం,  సేకరించిన మొత్తం (మెట్రిక్ టన్నులు),  విలువ రూ.కోట్లలో
201415         24,29,718                        3392.21
201516         23,55,991                        3396.65
201617        53,69,390                         8089.55
201718        53,98,819                         8565.15
201819        73,02,427                        12,906.38

Grain procurement increased in Telangana

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ధాన్యం సేకరణ భళా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: