బిజెపిలోకి కోమటిరెడ్డి బ్రదర్స్ …?

హైదరాబాద్‌ : టిఆర్ఎస్ జోరుతో తెలంగాణలో కాంగ్రెస్ డీలా పడింది. ఇప్పటికే కాంగ్రెస్ కు చెందిన 12 మంది ఎంఎల్ఎలు కారెక్కేశారు. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ అగ్రనేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు రాజగోపాల్ బిజెపిలో చేరేందుకు యత్నిస్తున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వీరు బిజెపి ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ తో బుధవారం చర్చలు జరిపినట్టు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వీరితో పాటు టిఆర్ఎస్ […] The post బిజెపిలోకి కోమటిరెడ్డి బ్రదర్స్ …? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్‌ : టిఆర్ఎస్ జోరుతో తెలంగాణలో కాంగ్రెస్ డీలా పడింది. ఇప్పటికే కాంగ్రెస్ కు చెందిన 12 మంది ఎంఎల్ఎలు కారెక్కేశారు. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ అగ్రనేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు రాజగోపాల్ బిజెపిలో చేరేందుకు యత్నిస్తున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వీరు బిజెపి ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ తో బుధవారం చర్చలు జరిపినట్టు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వీరితో పాటు టిఆర్ఎస్ మాజీ ఎంపి వివేక్, కల్వకుంట్ల రమ్యరావు తదితరులు కూడా బిజెపిలో చేరేందుకు యత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాము బిజెపిలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. తమపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బిజెపి నేత రాం మాధవ్ తో తాము చర్చలు జరిపినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన తేల్చి చెప్పారు. తమ కుటుంబం కాంగ్రెస్ లోనే ఉంటుందని, తెలంగాణలో పార్టీన అధికారంలోకి తీసుకరావడమే లక్ష్యంగా తాము పని చేస్తామని ఆయన స్పష్టం చేశారు. తాను బుధవారం నియోజకవర్గంలో పర్యటించానని, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. తాము బిజెపిలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలను ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు, తమ అభిమానులు నమ్మొద్దని ఆయన కోరారు.

Komatireddy Brothers Join BJP Soon

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బిజెపిలోకి కోమటిరెడ్డి బ్రదర్స్ …? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: