తలాక్.. ఆధార్.. కశ్మీర్

మోడీ మంత్రిమండలి కీలక నిర్ణయాలు న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది. త్రిపుల్ తలాక్ పద్ధతిని నిషేధించేందుకు తాజా బిల్లును తీసుకురానున్నారు. ఈ బిల్లుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇంతకు ముందటి ఎన్‌డిఎ ప్రభుత్వం ఫిబ్రవరిలో తీసుకువచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును తీసుకువస్తున్నారు. మంత్రిమండలి భేటీలో తీసుకున్న నిర్ణయాలను పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ విలేకరులకు తెలిపారు. […] The post తలాక్.. ఆధార్.. కశ్మీర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
మోడీ మంత్రిమండలి కీలక నిర్ణయాలు

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది. త్రిపుల్ తలాక్ పద్ధతిని నిషేధించేందుకు తాజా బిల్లును తీసుకురానున్నారు. ఈ బిల్లుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇంతకు ముందటి ఎన్‌డిఎ ప్రభుత్వం ఫిబ్రవరిలో తీసుకువచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును తీసుకువస్తున్నారు. మంత్రిమండలి భేటీలో తీసుకున్న నిర్ణయాలను పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ విలేకరులకు తెలిపారు. అన్ని అంశాలను జాగ్రత్తగా బేరీజు వేసుకుని తాజాగా సమగ్రరీతిలో తలాక్ బిల్లును తీసుకువచ్చినట్లు, దీనిని సోమవారం నుంచి ఆరంభం అయ్యే పార్లమెంట్ సమావేశాలలో ప్రవేశపెట్టనున్నట్లు జవదేకర్ తెలిపారు.

ఆధార్ సవరణ బిల్లు 2019

బ్యాంక్ ఖాతాలు తెరిచేందుకు ఆధార్‌ను స్వచ్ఛందం చేసేందుకు వీలుగా ఉండే తాజా బిల్లుకు కూడా కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. బ్యాంక్ ఖాతాలకు, మొబైల్ కనెక్షన్లు పొందేందుకు గుర్తింపు పత్రాలుగా (ఐడి) ఆధార్‌ను దాఖలు చేయడం ఐచ్ఛికం చేసే ఈ బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెడుతారు. ప్రస్తుతమున్న ఆధార్ ఆర్డినెన్స్‌కు బదులుగా ఈ సవరణ బిల్లును తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటివరకూ ఉన్న ఆధార్ చట్టానికి తగు సవరణలు తీసుకువస్తారని అధికార వర్గాలు తెలిపాయి. బాలురు తమకు 18వ సంవత్సరంలోకి వచ్చిన తరువాత బయోమెట్రిక్ గుర్తింపు విధానం (ఆధార్) ప్రక్రియ పరిధిలోకి రాకుండా ఉండే అవకాశాన్ని కల్సిస్తూ చట్టానికి సవరణలు తీసుకువచ్చారు.

దీని వల్ల భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (ఉడాయ్) సంవిధాన ప్రక్రియలో సముచిత మార్పులకు వీలేర్పడుతుంది. ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించడం, ఆధార్ దుర్వినియోగాన్ని నివారించడం వంటివి మరింత పటిష్టం అవుతాయి. ఈ సవరణలతో ఏ వ్యక్తి కూడా పార్లమెంట్‌లో తీసుకువచ్చే చట్టం పరిధిలో తప్ప ఇతరత్రా తన గుర్తింపు చాటుకోవడానికి ఆధార్ కల్గి ఉన్నట్లు చూపాల్సిన అవసరం లేదు. అదే విధంగా గుర్తింపు కోసం చేతివేళ్ల ముద్రలు ఇతరత్రా విధానాలకు బలవంతం చేయరాదు. ఈ విధంగా తగు సవరణలు చట్టంలో తీసుకువచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆధార్ కార్డుల వినియోగానికి సంబంధించి నిర్ధేశిత విధానాలను ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన జరిమానాలు విధించేందుకు వీలుగా సవరిత బిల్లులో మార్పులు చేపట్టారు.

కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన పొడిగింపు

జమ్మూ కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించనున్నారు. ఈ మేరకు తీసుకున్న నిర్ణయానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ నెల 20వ తేదీ నుంచి పొడిగింపు అమలులోకి వస్తుంది. 2018 జూన్ 20వ తేదీనుంచి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులో ఉంది. కేంద్ర కేబినెట్ ఆమోదంతో ఇక రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగింపు ఆదేశాల ప్రకటనను వెలువరిస్తారు.

Union cabinet takes key decisions

Related Images:

[See image gallery at manatelangana.news]

The post తలాక్.. ఆధార్.. కశ్మీర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: