సింగరేణి కార్మికుల ఇళ్లకు త్వరలో పట్టాలు

కార్యరూపం దాల్చనున్న సిఎం కెసిఆర్ హామీ కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలతో సచివాలయంలో సిఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ నర్సింగరావు సమావేశం కార్మికుల ఇళ్ల స్థలాలు, డిఎంఎఫ్‌టీపై సమీక్ష కొత్తగూడెం: సిఎం సింగరేణి కార్మికులు సింగరేణి స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్లకు పట్టాలు ఇస్తామన్న హామీ త్వరలో కార్యరూపం దాల్చనుంది. హైదరాబాద్‌లోని సచివాలయంలో కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలతో సిఎం ప్రిన్సిపల్ కార్యదర్శి నర్సింగరావు, బుధవారం ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. సింగరేణి సమీప గ్రామాల్లో డిఎంఎప్‌టి నిధులతో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, కార్మికులు సొంతంగా […] The post సింగరేణి కార్మికుల ఇళ్లకు త్వరలో పట్టాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కార్యరూపం దాల్చనున్న సిఎం కెసిఆర్ హామీ
కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలతో సచివాలయంలో
సిఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ నర్సింగరావు సమావేశం
కార్మికుల ఇళ్ల స్థలాలు,
డిఎంఎఫ్‌టీపై సమీక్ష

కొత్తగూడెం: సిఎం సింగరేణి కార్మికులు సింగరేణి స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్లకు పట్టాలు ఇస్తామన్న హామీ త్వరలో కార్యరూపం దాల్చనుంది. హైదరాబాద్‌లోని సచివాలయంలో కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలతో సిఎం ప్రిన్సిపల్ కార్యదర్శి నర్సింగరావు, బుధవారం ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. సింగరేణి సమీప గ్రామాల్లో డిఎంఎప్‌టి నిధులతో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, కార్మికులు సొంతంగా ఇళ్లు నిర్మించుకున్న స్థలాలకు పట్టాల మంజూరుపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్.నర్సింగరావు నిర్వహించారు.

సింగరేణి సిఅండ్‌ఎండి ఎన్.శ్రీధర్, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్‌తివారి, డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలనీ, సుశీల్‌కుమార్, జాయింట్ డైరెక్టర్ రఫీక్ అహ్మద్‌లో పాటు సింగరేణి ప్రాంత శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు, గండ్ర వెంకటరమణా రెడ్డి, బాల్క సుమన్, ఆత్మం సక్కు, రేగా కాంతారావు పాల్గొన్నారు. సిఎం 2018 ఫిబ్రవరిలో శ్రీరాంపూర్ ఏరియాలో సింగరేణి కార్మికుల ఆత్మయ సమ్మేళనంలో పాల్గొన్పప్పుడు కంపెనీ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్న కార్మికులకు ఆ ఇంటి స్థలాలపై పట్టాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

ఆ హామీ మేరకు సింగరేణి సంస్థ ప్రత్యేక చొరవతీసుకుంది. గతంలో ప్రభుత్వం ద్వారా సింగరేణికి ఇచ్చిన వాటిని తిరిగి ఆయా కలెక్టర్లకు తిరిగి అప్పగించింది. వీటితో పాటు ప్రభుత్వ ఆదేశంపై ఖాళీగా ఉన్నసింగరేణి స్థలాలను గుర్తించి వాటిని కూడా ప్రభుత్వ అవసరాలకు కలెక్టర్లకు అప్పగించింది. ఇలా ఆరు జిల్లాల్లో కలిపి మొత్తం 1713 ఎకరాలు భూమిని తిరిగి అప్పగించారు.

దీనితో కంపెనీ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి పట్టాలు మంజూరుకు మార్గం సులువైంది. దీనితో బుధవారం నర్సింగరావు ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కాగా సింగరేణి సమీప గ్రామాల అభివృద్ధికి ఉద్దేశించిన డిస్ట్రిక్ట్ మినరల్ డవలఫ్‌మెంట్‌ఫండ్ ట్రస్ట్ కింద 2015నుంచి ఇప్పటి వరకు రూ.1844కోట్లు సంస్థ విస్తరించిన ఆరు జిల్లాల కలెక్టర్ల వద్ద డిపాజిట్ చేసింది. ఈ మొత్తంతో సమీప గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించనున్నారు. ఈనిధులు ఏఏ పనులకు ఖర్చు చేయాలి , ఏ విషయాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అనేక విషయాలపై సింగరేణి ప్రాంత ఎమ్మెల్యే ల నుంచి సూచనలు స్వీకరించారు.

Documents of Singareni Workers Houses Are Soon Coming

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సింగరేణి కార్మికుల ఇళ్లకు త్వరలో పట్టాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: