ఆరోగ్య పథకాల అమలులో తెలంగాణ భేష్

దేశంలోనే ముందున్నట్లు నీతి ఆయోగ్ నివేదిక, ఎనిమిది అంశాలపై మూడు జిల్లాల్లో సర్వే  హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే ముందుందని నీతి అయోగ్ ప్రశంసించింది. తాజాగా విడుదల చేసిన ఒక నివేదికలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎంపిక చేసిన జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రత్యేక పథకాలను అమలు చేస్తోంది. వీటిని యాస్పిరేషనల్ జిల్లాలుగా పేర్కొంటున్నారు. ఈ జిల్లాల్లో అమలు చేసే పథకాలను ప్రధానమంత్రి […] The post ఆరోగ్య పథకాల అమలులో తెలంగాణ భేష్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
దేశంలోనే ముందున్నట్లు నీతి ఆయోగ్ నివేదిక, ఎనిమిది అంశాలపై మూడు జిల్లాల్లో సర్వే 

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే ముందుందని నీతి అయోగ్ ప్రశంసించింది. తాజాగా విడుదల చేసిన ఒక నివేదికలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎంపిక చేసిన జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రత్యేక పథకాలను అమలు చేస్తోంది. వీటిని యాస్పిరేషనల్ జిల్లాలుగా పేర్కొంటున్నారు. ఈ జిల్లాల్లో అమలు చేసే పథకాలను ప్రధానమంత్రి ప్రత్యేకంగా సమీక్షిస్తారు. నీతి అయోగ్ అమలు తీరుపై సర్వే నిర్వహించి నివేదికను ప్రధాన మంత్రికి అందజేస్తుంది.

అందులో భాగంగా దేశ వ్యాప్తంగా 117 జిల్లాల్లో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ పలు పథకాలను ప్రవేశపెట్టి వాటి అమలు తీరు సమీక్షించింది. రాష్ట్రం వీటిలో ముందున్నట్టు గుర్తించింది. ప్రధానంగా ఆసుపత్రుల్లో ప్రసవాలు, తల్లిపాల ప్రాధాన్యం, ప్రజారోగ్య వ్యవస్థలో స్పెషలిస్టు వైద్య సేవలు, డయేరియా నివారణ, తక్కువ బరువుతో పిల్లలు పుట్టకుండా ముందస్తు చర్యలు తదితర ఎనిమిది అంశాల అమలు తీరుపై నీతి అయోగ్ దృష్టిసారించింది. రాష్ట్రంలో కొమురంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం జిల్లాలను యాస్పిరేషనల్ జిల్లాలుగా గుర్తించింది. దేశవ్యాప్తంగా ఆ జిల్లాల్లో పైన పేర్కొన్న వివిధ అంశాల్లో ఏమేరకు పురోగతి సాధించిందోనన్న విషయంపై రెండుసార్లు సర్వే నిర్వహించింది.

ఆ సర్వేల్లో ఒక్క అంశంలో మినహా మిగిలిన అన్నింటిలోనూ తెలంగాణలోని ఆ మూడు జిల్లాలు పురోగతిలో ఉన్నాయని నిర్దారించింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖకు సమాచారం పంపించింది. మిగిలిన జిల్లాల్లోనూ వైద్య ఆరోగ్య పథకాలు భేషుగ్గా జరుగుతున్నాయని నీతి అయోగ్ పరిశీలకులు వెల్లడించింది.

తల్లిపాలు ఇవ్వడంలో వెనకబాటు..

తల్లిపాలు బిడ్డకు ఇవ్వడంలో మాత్రం ఈ జిల్లాలు వెనుకబడినట్టు నిర్ధారించింది. పుట్టిన గంటలోపులోనే నవజాత శిశువుకు తల్లిపాలు పట్టించాలి. అప్పుడే శిశువు ఆరోగ్యంగా పెరుగుతారు. కానీ తెలంగాణలోని ఆసిఫాబాద్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు మాత్రం ఈ రెండు సర్వేల్లో వెనుకబడి ఉన్నాయని నీతి అయోగ్ పేర్కొంది. మొదటి సర్వే కంటే రెండో సర్వే వచ్చే సరికి పరిస్థితి మరింత తక్కువ ఉందని పేర్కొంది. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరింది. గంటలోపు శిశువులకు తల్లిపాలు ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం మన రాష్ట్రంలో అత్యధికంగా సిజేరియన్ ద్వారా బిడ్డను బయటకు తీయడమే. సిజేరియన్ ఆపరేషన్ చేసిన వెంటనే తల్లులు శిశువులకు గంటలోపులో పాలు ఇవ్వడం అసాధ్యమైన విషయం.

ఇదే ప్రధాన కారణంగా చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఈ ఏడాది నివేదిక ప్రకారం మూడు నెలల్లో 1,03,827 ప్రసవాలు జరగ్గా, అందులో 62,591 మంది సిజేరియన్ ద్వారానే జరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 28,790, ప్రైవేటు ఆసుపత్రుల్లో 33,801 ప్రసవాలు సిజేరియన్ ద్వారా జరిగినట్లు నిర్దారించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైతేనే సిజేరియన్ చేస్తున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ఏదిఏమైనా తల్లిపాలు గంటలోపు శిశువుకు ఇవ్వకపోవడానికి సిజేరియన్ ఆపరేషన్లేనని వైద్యాధికారులు చెబుతున్నారు.

Telangana Best in implementation of health schemes

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆరోగ్య పథకాల అమలులో తెలంగాణ భేష్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: