ఢిల్లీలో కీలక సమావేశాలకు సిఎం

నీతి ఆయోగ్, జిఎస్‌టి సమావేశాలకు హాజరుకానున్న ముఖ్యమంత్రి కెసిఆర్ వెనుకబడిన 27 జిల్లాలకు నిధులు, దామాషా ప్రకారం కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి నివేదికలను సిద్ధం చేసిన అధికారులు హైదరాబాద్: ఈనెలలో ఢిల్లీ వేదికగా జరగనున్న రెండు కీలక సమావేశాలకు సిఎం కెసిఆర్ హాజరుకానున్నారు. ఈ మేరకు వాటికి సంబంధించిన నివేదికలు సిద్ధమవుతున్నట్టుగా అధికారిక వర్గాల సమాచారం. నీతిఅయోగ్ 5వ సమావేశం (ఈనెల 15వ తేదీన) ఢిల్లీలో జరగనుండగా ఈ భేటీలో ఆర్థిక మంత్రులంతా పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర […] The post ఢిల్లీలో కీలక సమావేశాలకు సిఎం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నీతి ఆయోగ్, జిఎస్‌టి సమావేశాలకు హాజరుకానున్న ముఖ్యమంత్రి కెసిఆర్
వెనుకబడిన 27 జిల్లాలకు నిధులు, దామాషా ప్రకారం కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి
నివేదికలను సిద్ధం చేసిన అధికారులు

హైదరాబాద్: ఈనెలలో ఢిల్లీ వేదికగా జరగనున్న రెండు కీలక సమావేశాలకు సిఎం కెసిఆర్ హాజరుకానున్నారు. ఈ మేరకు వాటికి సంబంధించిన నివేదికలు సిద్ధమవుతున్నట్టుగా అధికారిక వర్గాల సమాచారం. నీతిఅయోగ్ 5వ సమావేశం (ఈనెల 15వ తేదీన) ఢిల్లీలో జరగనుండగా ఈ భేటీలో ఆర్థిక మంత్రులంతా పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హోదాలో కెసిఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. 20వ తేదీన ఢిల్లీలో జీఎస్టీకౌన్సిల్ సమావేశాలు జరగనున్నాయి. అయితే రెండోసారి మోడీ ప్రధాని బాధ్యతలు చేపట్టిన తరువాత జరుగుతున్న ఈ రెండు సమావేశాలు ప్రస్తుతం కీలకం కానున్నాయి.

తలసరి ఆదాయం ఆధారంగా రాష్ట్రంలో 27 జిల్లాలు వెనుకబడి ఉన్నాయని నీతిఅయోగ్ 5వ సమావేశంలో నివేదించనున్నట్టుగా సమాచారం. అనేక పథకాలు, నీటి సంరక్షణకు తెలంగాణ సర్కారు చేస్తున్న కృషితో సత్ఫలితాలు వస్తున్నాయని ఆ నివేదికలో పేర్కొంటూ నిధుల సిఫారసులో పక్షపాతం లేకుండా చూడాలని కోరేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమయ్యింది. తాగునీటి, సాగునీటి సమస్య సమస్యల నివారణతో పాటు హైదరాబాద్ లాంటి నగరాలకు నీటి కొరత లేకుండా నిర్మించనున్న మూడు జలాశయాలను పరిగణలోకి తీసుకోవాలని కోరనున్నారు.

దామాషా ప్రకారం వెనుకబడిన జిల్లాలకు భారీ నిధులను ఇవ్వాలని సిఎం కెసిఆర్ విజ్ఞప్తి చేయనున్నట్టుగా తెలిసింది. రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణను ప్రత్యేకంగా పేర్కొంటూ తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు పెద్ద ఎత్తున నిధులను కోరాలని సిఎం కెసిఆర్ నిర్ణయించినట్టుగా తెలిసింది. కొత్త రాష్ట్రం తెలంగాణలో గడిచిన ఐదేళ్లుగా సాధిస్తున్న పురోగతిని నివేదించడంతో పాటు వాటికి కావాల్సిన నిధుల ఆవశ్యకతను సిఎం విన్నవించనున్నారని అధికారులు తెలిపారు.

మౌలిక సదుపాయాల కల్పనకు..

ప్రధానంగా ఇప్పటివరకు అనుసరిస్తున్న పన్నుల వాటాకు సంబంధించిన ప్రాతిపదిక అంశాలను పునః పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. ఇప్పటివరకు అనుసరిస్తున్న ప్రాతిపదిక అంశాలను మార్చాలని నీతి అయోగ్ దృష్టికి తీసుకు రానున్నారు. పన్నుల వాటాలో రాష్ట్రాల కేటాయింపులకు ప్రధానంగా ఆర్థిక క్రమశిక్షణనే ప్రాతిపదికన తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించనుంది. రాష్ట్ర రుణపరిమితి (ఎఫ్‌ఆర్‌బిఎం) మొత్తాన్ని ఆర్థికంగా మిగులులో ఉన్న రాష్ట్రానికి 3 నుంచి 3.5 శాతానికి పెంచాలన్న డిమాండ్‌తో పాటు మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులకు అమలు చేస్తున్న పథకాలకు నిధుల సాయం కోరాలని ఆ నివేదికలో పొందుపరిచినట్టుగా తెలిసింది. కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో రాష్ట్రంలో పట్టణీకరణ పెరగడం, కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు వంటి అంశాలను కేంద్రం ముందు ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కనీస వసతులు, మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా నిధులను కోరాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండల, జిల్లా పరిషత్‌లకు ఆర్థిక సంఘం నుంచి నిధులిచ్చి వెన్నుదన్నుగా నిలిచేలా మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా సమాచారం. వీటితో పాటు గ్రామీణ ప్రాంతాల రహదారుల నిర్మాణానికి చేయూతనిచ్చేలా ఉదారంగా వ్యవహారించేలా కేంద్రాన్ని ఒప్పించేందుకు నివేదికను సిద్ధం చేయాలని అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించినట్టుగా తెలిసింది.

పన్నుల వాటాను తగ్గించడానికి వ్యతిరేకం..

ప్రధానంగా నీతి అయోగ్ సమావేశంలో నీటి సంరక్షణ, కరువు ఉపశమన చర్యలు, అకాంక్షిత జిల్లాలు, వ్యవసాయ రంగంలో విధానపరమైన సంస్కరణలు, వ్యవసాయోత్పత్తులు, మార్కెట్ కమిటీల చట్టం, నిత్యావసర సరుకుల చట్టం 1955 వంటి అనేక అంశాలపై చర్చించనున్నారు. అయితే దేశంలోనే వ్యవసాయ రంగానికి రాష్ట్రం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో అనేక పథకాలు ఇందులో చర్చకు రానున్నట్టుగా తెలిసింది. కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాలకు తెలంగాణ పథకాలను వివరించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.

నీతి అయోగ్ ప్రశంసించిన రైతుబంధు, రైతుబీమా వంటివి ఈ సమావేశంలో కీలకం కానున్నాయి. ఉపాధిహామీతో వ్యవసాయా న్ని అనుసంధానించాలని సిఎం ఈ సమావేశంలో కేంద్రా న్ని కోరనున్నట్టు తెలిసింది. అదేవిధంగా పన్నుల వాటా ప్రాతిపదికగా నిధుల కేటాయింపులు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నీతి అయోగ్‌కు సూచించింది. ధనిక రాష్ట్రంగా తెలంగాణను చూస్తూ పన్నుల వాటాను తగ్గించడాన్ని వ్య తిరేకించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది.

CM KCR attend Niti Aayog and GST meetings

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఢిల్లీలో కీలక సమావేశాలకు సిఎం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.