అత్యాచారం చేయబోయిన వ్యక్తి నాలుకను కొరికి…

సౌత్‌ఆఫ్రికా: తనపై అత్యాచారం చేయబోయిన వ్యక్తి నాలుకను ఓ డాక్టర్ కొరికి ముక్కలు ముక్కలు చేసింది. ఈ ఘటన సౌత్ ఆఫ్రికాలో చోటు చేసుకుంది. ఓ యువతి (24) ఓ ఆస్పత్రిలో డాక్టర్ గా పని చేస్తోంది. అదే అస్సత్రి క్వార్టర్స్ లో నివసిస్తోంది. ఈనెల 10న ఆమె నిద్రబోతున్న సమయంలో ఓ పేషంట్ ఆమెపై అత్యాచార యత్నం చేయబోయాడు. ఈ క్రమంలో అతడి నుంచి తనను తాను రక్షించుకునేందుకు సదరు డాక్టర్ అతడి నాలుకను కొరికేసింది. […] The post అత్యాచారం చేయబోయిన వ్యక్తి నాలుకను కొరికి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

సౌత్‌ఆఫ్రికా: తనపై అత్యాచారం చేయబోయిన వ్యక్తి నాలుకను ఓ డాక్టర్ కొరికి ముక్కలు ముక్కలు చేసింది. ఈ ఘటన సౌత్ ఆఫ్రికాలో చోటు చేసుకుంది. ఓ యువతి (24) ఓ ఆస్పత్రిలో డాక్టర్ గా పని చేస్తోంది. అదే అస్సత్రి క్వార్టర్స్ లో నివసిస్తోంది. ఈనెల 10న ఆమె నిద్రబోతున్న సమయంలో ఓ పేషంట్ ఆమెపై అత్యాచార యత్నం చేయబోయాడు. ఈ క్రమంలో అతడి నుంచి తనను తాను రక్షించుకునేందుకు సదరు డాక్టర్ అతడి నాలుకను కొరికేసింది. దీంతో అతడి నాలుక ముక్కలు ముక్కలుగా విడిపోయింది. పోలీసు అతడిపై కేసు నమోదు చేశారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి నాలుకకు ప్లాస్టిక్ సర్జరీ చేసి, తిరిగి నాలుకను అమర్చారు. నిందితుడు కోలుకున్న అనంతరం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు వెల్లడించారు.

Rape Attempt on Lady Doctor In South Africa

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అత్యాచారం చేయబోయిన వ్యక్తి నాలుకను కొరికి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: