కొట్టి.. మూత్రం తాగించారు…

  యుపిలో ఓ జర్నలిస్టుకు నరకం చూపారు స్థానిక రైల్వే పోలీసు బృందం రాక్షసకాండ రైలు పట్టాలు తప్పిన వార్తను అడ్డుకునే చర్య లక్నో : ఉత్తరప్రదేశ్‌లో జర్నలిస్టు అమిత్ శర్మకు రైల్వే పోలీసులు నరకం చూపించారు. తన నోట్లో రైల్వే పోలీసులు మూత్రం పోశారని ఈ జర్నలిస్టు తెలిపారు. మంగళవారం సాయంత్రం ధిమాన్‌పూర్ గేట్ వద్ద ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీనికి సంబంధించి వార్తను సేకరించేందుకు వెళ్లినప్పుడు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని […] The post కొట్టి.. మూత్రం తాగించారు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

యుపిలో ఓ జర్నలిస్టుకు నరకం చూపారు
స్థానిక రైల్వే పోలీసు బృందం రాక్షసకాండ
రైలు పట్టాలు తప్పిన వార్తను అడ్డుకునే చర్య

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో జర్నలిస్టు అమిత్ శర్మకు రైల్వే పోలీసులు నరకం చూపించారు. తన నోట్లో రైల్వే పోలీసులు మూత్రం పోశారని ఈ జర్నలిస్టు తెలిపారు. మంగళవారం సాయంత్రం ధిమాన్‌పూర్ గేట్ వద్ద ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీనికి సంబంధించి వార్తను సేకరించేందుకు వెళ్లినప్పుడు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఈ జర్నలిస్టు బుధవారం తెలియచేశారు. తన డ్యూటీ చేసుకుంటుండగా అక్కడున్న రైల్వే పోలీసులు పట్టుకుని, నిర్బంధించారని, తరువాత బట్టలూడదీసి, తనను నగ్నంగా నిలబెట్టారని ఈ జర్నలిస్టు తన బాధ వ్యక్తం చేశారు. తరువాత మూత్రం పోశారని ఈ జర్నలిస్టు చెప్పారు.

న్యూస్ 24 ఛానల్‌లో రిపోర్టరుగా పనిచేస్తున్న అమిత్ శర్మ ఇప్పటికీ షాక్‌తోనే ఉన్నారు. ఆయన కొన్ని పత్రికల వారితో ఫోన్‌లో మాట్లాడారు. రైలు పట్టాలు తప్పిన చోట తాను వీడియో తీయడానికి యత్నిస్తుండగా అక్కడున్న షామిలీ జిఆర్‌పి స్టేషన్ హెడ్ ఆఫీసరు రాకేష్ ఉపాధ్యాయ్, కానిస్టేబుల్ సంజయ్ పన్వర్‌లు అభ్యంతరం చెప్పారు. అక్కడి నుంచి ఆయనను నెట్టివేస్తూ పక్కకు తీసుకువెళ్లారు. తరువాత రైల్వే పోలీసు స్టేషన్‌లో అక్కడున్న సిబ్బంది ముందుగా తీవ్రంగా కొట్టారు. తరువాత లాకప్‌లో వేశారు. లాకప్‌లో ఉన్నప్పుడే రైల్వే పోలీసులు ఆయన పట్ల అమానుషంగా వ్యవహరించినట్లు ఆయన కథనంతో వెల్లడైంది.

ఘటన గురించి తెలియగానే తోటి జర్నలిస్టులు పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. అమిత్‌ను వెంటనే విడుదల చేయాలని, దౌర్జన్యానికి దిగిన వారిపై చర్యలు తీసుకోవాలని పట్టు పట్టారు, పోలీసులే కాకుండా ఇతరులు కూడా దౌర్జన్యానికి దిగారని, వారిని శిక్షించాలని కోరారు. బుదవారం స్థానిక జర్నస్టులు జిఆర్‌పి పోలీసు స్టేషన్ వద్ద గుమికూడారు. ఈ ఘటనలో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుపై జరిగిన దారుణంపై అన్ని స్థాయిలలో తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో ఉన్నతాధికారులు ఎట్టకేలకు స్పందించారు.

స్టేషన్ అధికారి రాకేష్ కుమార్‌పై, కానిస్టేబుల్ సంజయ్ పన్వార్‌పై చర్యలు చేపట్టారు. వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని గజియాబాద్ సిఐ రమేష్ త్రిపాఠీని ఆదేశించినట్లు రైల్వే పోలీసు ఉన్నతాధికారి దూబే తెలిపారు. త్వరలోనే తనకు నివేదిక అందుతుందని, దీని మేరకు తదుపరి చర్యలు చేపడుతామని వివరించారు. రైల్వే పోలీసుల ఆగడాలపై జర్నలిస్టు అమిత్ ఇంతకు ముందు కొన్ని వార్తా కథనాలు వెలువరించారని, ఆయనపై కక్షతోనే సమయం చూసుకుని ఈ విధంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి.

Reporter in Uttar Pradesh was Humiliated

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కొట్టి.. మూత్రం తాగించారు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: