విమాన ప్రమాదం పాఠాలు

  భారత వాయుసేనకు చెందిన ఎఎన్ 32 విమానం గల్లంతయ్యింది. జూన్ 3వ తేదీన 13 మంది సిబ్బందితో జోర్హాట్ నుంచి బయలుదేరిన విమానం ఆచూకీ ఆ తర్వాత తెలియలేదు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని మెంచూకా వెళ్ళవలసిన విమానం అది. వాయుసేన అధికారులు స్టాండర్డ్ విమానం కోసం వెదకడం ప్రారంభించారు. చివరకు ఎనిమిది రోజుల తర్వాత కాని విమాన శిధిలాలను కనిపెట్టలేకపోయారు. కొండలు, హఠాత్తుగా మారే వాతావరణంలో చాలా సందర్భాల్లో ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. ఎఎన్ 32 వంటి పాత […] The post విమాన ప్రమాదం పాఠాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

భారత వాయుసేనకు చెందిన ఎఎన్ 32 విమానం గల్లంతయ్యింది. జూన్ 3వ తేదీన 13 మంది సిబ్బందితో జోర్హాట్ నుంచి బయలుదేరిన విమానం ఆచూకీ ఆ తర్వాత తెలియలేదు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని మెంచూకా వెళ్ళవలసిన విమానం అది. వాయుసేన అధికారులు స్టాండర్డ్ విమానం కోసం వెదకడం ప్రారంభించారు. చివరకు ఎనిమిది రోజుల తర్వాత కాని విమాన శిధిలాలను కనిపెట్టలేకపోయారు.

కొండలు, హఠాత్తుగా మారే వాతావరణంలో చాలా సందర్భాల్లో ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. ఎఎన్ 32 వంటి పాత విమానాలు పరిమాణం చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ విమానాలు కొండలతో నిండిన ప్రాంతంలో, హఠాత్తుగా మారే వాతావరణం ఉన్న ప్రాంతాల్లో ఎగరడం కష్టం. ఎందుకంటే, హఠాత్తుగా ఎదురయ్యే పరిస్థితులను అధిగమించే ఆధునిక ఏర్పాట్లు అందులో ఉండవు. ఇలా కూలిపోయిన అనేక విమానాల గురించి వాయుసేన అధికారులను ఎవరిని అడిగినా చెబుతారు.

ఈ విమాన ప్రమాదం చరిత్రలో వైమానిక దళ విమానాల ప్రమాదాల్లో మరో సంఘటనగా మాత్రమే మిగిలిపోరాదు. కాని అలాగే జరుగుతుందని అనిపిస్తోంది. పదేళ్ళ క్రితం 2009లో, జూన్ లోనే వాయుసేనకు చెందిన మరో ఎఎన్ 32 విమానం ఈ అరుణాచల్‌ప్రదేశ్ లోని సియాంగ్ జిల్లాలో కూలిపోయింది. అప్పుడు కూడా 13 మంది సిబ్బంది మరణించారు. విమాన శిధిలాలు 24 గంటల తర్వాత దొరికాయి. ఈ పదేళ్ళ కాలంలో మనం నేర్చుకున్న గుణపాఠమేముంది? ఇప్పుడు మరో విమానం అలాంటి పరిస్థితుల్లోనే కూలిపోయింది.

కొండ ప్రాంతాల్లో విమానాలను నడపడం సవాళ్లతో కూడుకున్నది. కొండల మధ్య నుంచి వెళ్ళవలసి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో నేవిగేషన్ కోసం కంటితో చూసి, చెవులతో వింటూ విమానాన్ని నడపడం చాలా కష్టంతో కూడుకున్న విషయం. ఈ పాత విమానాల్లో ఆధునిక సదుపాయాలు ఉండవు. రన్ వేను కనిపెట్టి సురక్షితంగా విమానాన్ని దించే పరికరాలు ఉండవు. ఎఎన్ 32 వంటి విమానం టర్నింగ్ తీసుకునే వంపు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. గ్రౌండ్ ప్రాక్సిమిటి వార్నింగ్ సిస్టమ్, టెర్రేన్ ఎవేర్ నెస్ వార్నింగ్ వంటి ఆధునిక పరికరాలు లేవు. ఇవేవీ భారత మిలిటరీ విమానాల్లో సాధారణంగా కనిపించవు. ఒకవేళ ఉన్నా కూడా చాలా సందర్భాల్లో వాటిని ఉపయోగించడం జరగదు. 1991 నుంచి 2014 మధ్య కాలంలో, నౌకాదళంలో నేను ఉన్నప్పుడు, నేనెన్నడూ టెర్రేన్ ఎవేర్‌నెస్ వార్నింగ్ వ్యవస్థను ఉపయోగించడం చూడలేదు. కాని పౌర విమానాలు నడుపుతున్నవారు ఈ ఆధునిక పరికరాలను విస్తృతంగా ఉపయోగిస్తారు.

భద్రత విషయంలో మన వైఖరి ఎల్లప్పుడు ప్రతిచర్యాత్మకంగానే ఉంది. ముందుగానే ప్రమాదాలను నివారించే ధోరణి మనలో ఎన్నడూ లేదు. అత్యాధునిక సాంకేతిక పరికరాలను, పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే విషయంలో వెనుకబాటు కనిపిస్తోంది. చాలా మంది సీనియర్ అధికారులు “మా కాలంలో” అనే కథలతో ఆధునిక సాంకేతికతను దూరం చేస్తున్నారు.

2016లో ఎఎన్ 32 విమానం ఒకటి బంగాళాఖాతంలో కూలిపోయినప్పుడు ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహా దానిని తన జీవితంలో అతి విషాదకరమైన సంఘటనగా పేర్కొన్నారు. ఆ విమానంలో 29 మంది సిబ్బంది ఉన్నారు. చెన్నయ్ నుంచి పోర్ట్ బ్లెయిర్ వెళుతూ హఠాత్తుగా మాయమైపోయింది. 1000 గంటల పాటు విమానం కోసం వెదికారు. ఎంత వెదికినా విమానం జాడ కనిపించలేదు. కాని, అండర్ వాటర్ లొకేటర్ బీకన్ లేదా ఎమర్జన్సీ లొకేటర్ ట్రాన్స్ మిటర్ వంటి అతి సులభంగా లభించే చిన్న పరికరం ఉంటే ఈ వెదుకులాట ఉండేది కాదు. ఈ పరికరం విమానంలో ఉంటే ప్రమాదాన్ని నివారించడం సాధ్యపడేదని చెప్పడం లేదు. కాని ఈ పరికరం ఉంటే, విమాన శిధిలాల కోసం వెదికే ఈ శ్రమ, వేలాది గంటల వెదుకులాట, దీనికి సంబంధించిన ఖర్చు ఉండేది కాదు. అలాగే విమాన ప్రమాదాలను నివారించడానికి కూడా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. 2016లో కాని విమానాల్లో అండర్ వాటర్ లొకేటర్ అవసరమని గుర్తించలేదు.

అసలు మనం మనిషి జీవితానికి ఎంత విలువ ఇస్తున్నామన్నది కూడా చాలా ముఖ్యం. భద్రతా ప్రమాణాలకు ప్రాముఖ్యం ఇచ్చే విషయంలో మన వైఖరిని సమీక్షించుకోవలసి ఉంది. జరగరాని ప్రమాదం జరిగినప్పుడు నిద్రలేచి, అన్వేషణకు శక్తిసామర్థ్యాలన్నీ వెచ్చిస్తుంటాం. భద్రతకు సంబంధించిన పరికరాలను, ప్రమాణాలను పాటించడానికి అయ్యే ఖర్చుతో పోల్చితే నిజానికి ఈ అన్వేషణలకు అయ్యే ఖర్చు ఎక్కువ. కాని ఈ ఖర్చు గోప్యంగానే ఉంటుంది. ఖాతాల్లోకి రాదు. ఆ తర్వాత ధైర్యసాహసాలతో అన్వేషణ చేసిన వారికి అవార్డులు, రివార్డులు ఇస్తుంటాం. 2005లో నేవీ విమానం ఒకటి ప్రమాదానికి గురైంది. అందులో నా మిత్రులిద్దరు చనిపోయారు. ప్రమాదం జరిగిన ప్రాంతం దట్టమైన అడవి.

కమాండోలను అన్వేషణకు పిలవవలసి వచ్చింది. 1985లో జరిగిన ఇలాంటి ప్రమాదంలోనూ శిధిలాలను కనిపెట్టడానికి భారీ స్థాయిలో అన్వేషణ చేపట్టవలసి వచ్చింది. కొన్ని నెలల తర్వాత కాని శిధిలాలు, మృతదేహాలు దొరకలేదు. ఆధునిక పరికరాలు, భద్రతా ప్రమాణాలను పాటించడంలో వెనుకబాటు ఇంకా కొనసాగుతోంది. నేవీ విమానాల్లో ఇప్పటికీ కూడా ఆధునిక వాతావరణ రాడార్ అరుదు. మనం ఒక విచిత్రమైన స్థితికి చేరుకున్నాం. ప్రమాదం జరిగినప్పుడు విమాన శిధిలాలను వెదకడానికి భారీ స్థాయిలో అన్వేషణ చేపట్టడం వైపు మొగ్గు చూపుతున్నామే కాని, అసలు ప్రమాదాలను నివారించే ముందు జాగ్రత్తల విషయంలో అశ్రద్ధ వహిస్తున్నాం. అత్యాధునిక పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం, భద్రతా ప్రమాణాలు పాటిస్తే అసలు ఈ ప్రమాదాలు జరక్కుండా నివారించవచ్చు. ఆ దిశగా ఇప్పటికైనా ఆలోచిస్తారని ఆశిద్దాం.

                                                                     – కమాండర్ కె.పి.సంజీవ్ కుమార్ (స్క్రోల్)

IAF missing AN-32 spotted in Arunachal Pradesh

Related Images:

[See image gallery at manatelangana.news]

The post విమాన ప్రమాదం పాఠాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: